
“టిడిపి అధికారంలో ఉన్నప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం 120 పధకాలు రూపొందించి అమలుచేసింది. అయితే జగన్ ప్రభుత్వం ఇంకా ఎక్కువ పధకాలు అమలుచేస్తున్నట్లు గొప్పలు చెప్పుకొంటున్నప్పటికీ వాటిలో కొన్నిటికి పేర్లు మార్చి సొంతపేర్లు పెట్టుకొంది. మరికొన్నిటిలో నిబందనల పేరుతో లబ్ధిదారులని తగ్గించుకొనే ప్రయత్నం చేస్తోంది. మరికొన్ని చెప్పుకోవడమే తప్ప ఏనాడూ అమలుచేసింది లేదు. టిడిపి మొదటి నుంచి బడుగు బలహీనవర్గాల ప్రజల సంక్షేమం, వారికీ రాజ్యాధికారం కల్పిస్తోందనే సంగతి మీ అందరికీ తెలుసు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఈసారి బీసీలలో ఉపకులాలవారికి సైతం మేలు చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తానని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఏవో మొక్కుబడిగా కార్పొరేషన్లు పెట్టడం కాకుండా వాటికి తగినన్ని నిధులు సమకూర్చి, వాటిని మీ చేతుల్లోనే పెడతాను. వాటిని మీరు ఏవిదంగా ఉపయోగించుకొంటారో మీ ఇష్టం. అవే కాకుండా, అర్హత కలిగినవారికి వివిద కార్పొరేషన్లలో పదవులలో నియమిస్తాం. ఇదివరకు నేను మంత్రిగా ఉన్నప్పుడు బీసీలకి ఏమీ చేయలేదని చెప్పడం కరెక్ట్ కాదు. అలాగని అన్నీ చేసేశానని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. మీ కోసం కొంత చేయగలిగాను. ఇంకా చేయవలసింది చాలానే ఉంది. కనుక ఈసారి టిడిపి అధికారంలోకి వస్తే మీ అందరికీ తప్పక న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నాను,” అని నారా లోకేష్ అన్నారు.
The TDP, despite being the ruling party in Andhra Pradesh, has agreed to share a…
The Indian selection committee has announced the Test and ODI squads for the upcoming tour…