
గన్నవరం నియోజకవర్గం ‘నా అడ్డా’ అంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తొడగొడుతూ ఉంటారు. కానీ పెనమలూరులో ప్రజలు తెల్లవారు జామున 2 గంటలవరకు నారా లోకేష్ కోసం మేల్కొని ఎదురుచూశారు. నారా లోకేష్‌కు ఘనస్వాగతం పలికారు.
వల్లభనేని వంశీ అనుచరులు కొన్ని నెలల క్రితం గన్నవరంలోని టిడిపి కార్యాలయాన్ని, దాని ముందు పార్క్ చేసిన టిడిపి నేతల కార్లను తగులపెట్టిన సంగతి తెలిసిందే. కనుక వంశీ సవాలుకి జవాబుగా నేడు నారా లోకేష్ గన్నవరంలో లక్షమందితో భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. గన్నవరంలో ఇంతవరకు కనీవిరుగని స్థాయిలో ఈ బహిరంగసభ ఉంటుందని టిడిపి నేతలు చెపుతున్నారు.
అంతకు ముందు వైసీపీ సీనియర్ నేత యార్లగడ్డ వెంకటరావు పార్టీకి గుడ్ బై చెప్పేసి నిన్న హైదరాబాద్ వెళ్ళి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. గన్నవరం టికెట్ ఇస్తే గెలిచి బహుమతిగా అందిస్తానని హామీ ఇచ్చారు. అందుకు చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు.
కనుక యార్లగడ్డ వెంకటరావు, ఆయన అనుచరులు కూడా టిడిపిలోకి వస్తుండటంతో గన్నవరంలో టిడిపి, వైసీపీ బలాబలాలు మారనున్నాయి. ఈరోజు గన్నవరం బహిరంగసభలో నారా లోకేష్ సమక్షంలో యార్లగడ్డ వెంకటరావు, ఆయన అనుచరులు టిడిపిలో చేరబోతున్నారు. కనుక వారందరూ కూడా గన్నవరం నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర, బహిరంగసభని విజయవంతం చేసేందుకు టిడిపి నేతలతో చేతులు కలిపి పనిచేస్తున్నారు.
Tensions erupted in Punganur in Andhra Pradesh’s Annamayya district on the first day of local…
The TDP-led alliance has finalised its seat-sharing arrangement for the Andhra Pradesh Local Body Elections.…