Telugu

అందరూ మాట్లాడేందుకు ఓ వేదిక యువగళం… రండి మాట్లాడండి!

టిడిపి యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర టిడిపి కోసం చేపడుతున్న ఓ రాజకీయయాత్ర మాత్రమే అనే భావన చాలా మందిలో ఉంది. కానీ వైసీపీ అరాచక పాలనతో వేసారిపోయున్న రాష్ట్ర ప్రజలు తమ కష్టానష్టాలు, సమస్యలు, అభిప్రాయాలు చెప్పుకొనేందుకు ఓ వేదిక అని నారా లోకేష్‌ చెపుతున్నారు.

నిన్న భీమవరం నియోజకవర్గంలో వెంప గ్రామంలో నారా లోకేష్‌ క్షత్రియ సామాజిక వర్గంతో ముఖాముఖీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్‌ వారికి చెప్పిన మాటలు చాలా ఆలోచింపజేస్తాయి.

ADVERTISEMENT

ఈ సమావేశానికి హాజరైన వారిలో ఒకరు, తాము బహిరంగంగా రాజకీయాలు చేయలేని పరిస్థితి నెలకొందని, ఒకవేళ ఎవరైనా ధైర్యం చేస్తే వారిపై వైసీపీ దాడులు చేయిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో టిడిపి తమకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై నారా లోకేష్‌ స్పందిస్తూ, “వైసీపీ దౌర్జన్యాలను భరిస్తూనే మేము ఎదిరించిపోరాడుతున్నాము. పుంగనూరులో చంద్రబాబు నాయుడు పర్యటించినప్పుడు, నిన్న నేను తాడేరులో పర్యటిస్తున్నప్పుడు, వైసీపీ మూకలు ఏవిదంగా దాడులు చేశాయో మీరందరూ చూశారు. అయినప్పటికీ మేము వాటికి భయపడి ఆగిపోవడం లేదు. ధైర్యంగా పోరాడుతూనే ఉన్నాము.

తాడేరులో వైసీపీ మూకలు మాపై రాళ్ళతో దాడులు చేస్తే, పోలీసులు యువగళం పాదయాత్రలో పాల్గొంటున్న మా వాలంటీర్లను అరెస్ట్‌ చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. అయినప్పటికీ వారు ధైర్యం కోల్పోలేదు. టిడిపి కోసం, రాష్ట్రం కోసం వైసీపీ ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటామని చెపుతున్నారు.

అలాగే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ధైర్యంగా పోరాడితేనే ఈ వైసీపీని ఓడించి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించగలము. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎన్నడూ ఇటువంటి అరాచక పరిస్థితులు లేవని మీ అందరికీ తెలుసు. కనుక రాష్ట్రంలో మళ్ళీ శాంతి నెలకొనాలంటే ముందు ఈ జగన్‌ను గద్దె దించాలి. ఆ తర్వాతే మీ అందరి సమస్యలను తీర్చగలుగుతాము,” అని అన్నారు.

ఈ సందర్భంగా నారా లోకేష్‌ చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి చేస్తున్న అక్రమాల గురించి వివరించి, జిల్లాలో ఏమి చేయాలన్నా వారే చేయాలి లేదా వారి అనుమతి తీసుకోవలసిందే. ఇప్పుడు మిథున్ రెడ్డి మీ గోదావరి జిల్లాలకు రాబోతున్నాడు. ఇక్కడ కూడా అతను తన సామ్రాజ్యం స్థాపించుకోగలిగితే గోదావరి జిల్లాలను కూడా దోపిడీ చేస్తారు. ఇక్కడ కూడా చిత్తూరు జిల్లాలో పరిస్థితులు ఏర్పడతాయని కనుక ఎట్టి పరిస్థితులలో మిథున్ రెడ్డి గోదావరి జిల్లాలలో అడుగుపెట్టకుండా అడ్డుకోలసిన భాద్యత ఇక్కడి ప్రజలదే అని నారా లోకేష్‌ సూచించారు.

యువగళం పాద‌యాత్రలో నిన్న 206వ రోజు భీమవరం నియోజకవర్గంలో వెంప గ్రామం వ‌ద్ద పాద‌యాత్ర‌ 2,800 కి.మీ. పూర్తవడంతో నారా లోకేష్‌ అక్కడ మీ ఇస్తూ శిలాఫ‌ల‌కం ఆవిష్క‌రించారు. ఆక్వారైతులకు జోన్లతో సంబంధం లేకుండా యూనిట్ రూ.1.50 పైసలకే విద్యుత్ అందిస్తానని, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Can Anil Ravipudi Pull Off Nelson-Style Dark Humour?

Anil Ravipudi knows how to make fans laugh, whistle and celebrate in theaters. But what…

20 minutes ago

Bigg Boss Telugu: ROSHA Breakup Confirmed?

Rohith is one of the potential Bigg Boss Telugu contestants who could win the title.…

50 minutes ago