Telugu

‘నారా’యణలో కూడా ‘నారా’ నే వినిపిస్తుందా.?

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ఆయన మానస పుత్రిక సాక్షి మీడియాకు ‘నారాయణ’ అనే దేవుని నామస్మరణలోనూ ‘నారా’ అనే పదం మాత్రమే కనిపిస్తుంది, వినిపిస్తుంది అన్నట్టుగా నడుచుకుంటారు.

చావుతోనూ రాజకీయమే, చావులోనూ రాజకీయమే అన్నట్టుగా జగన్ ప్రతి దానిని తన రాజకీయ లబ్ది కోసమే వినియోగించుకుంటారు. హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన తండ్రి వైస్ రాజశేఖర్ రెడ్డి మృతి తోనూ జగన్ రాజకీయమే చేసారు, ఆ చావులోనూ తన రాజకీయ లబ్దినే కాంక్షించారు.

ADVERTISEMENT

ఇక బాబాయ్ వివేకా హత్యతోను జగన్ ఆడిన రాజకీయ చదరంగంలో బాధితులు పావులైతే, అమాయకులు దోషులయ్యారు. ‘నారా’వారి రక్త చరిత్ర అంటూ సాక్షి రాసిన సాక్ష్యాలు లేని కథనాలు, జగన్ చేసిన విలువలు లేని విష ప్రచారం నాటి టీడీపీ ఓటమికి వైసీపీ విజయానికి బాటలు వేసాయి.

వివేకా హత్య కు సాక్షిగా నిలిచిన గొడ్డలి వైస్ కుటుంబ సభ్యులను చూపిస్తుంటే, జగన్ కు సాక్షికి మాత్రం ఈ రక్తపు మరకలు ‘నారా’ వారివిగా కనిపించాయి…వాటినే తమ నీలి మీడియాతో ప్రపంచానికి వినిపించారు.

ఇక తన తండ్రి మరణం తరువాత వైస్ జగన్ జీవితంలో జరిగిన ఊహించని మలుపులకు కారణం ‘నారా’ CBN అంటూ దుష్ప్రచారం చేసుకున్నారు జగన్, సాక్షి. అయితే జగన్ జైలు జీవితం వెనుక దాగిఉన్న రహస్యాలను వైస్ షర్మిల ఒక్కొక్కటిగా బయటపెడుతున్న నేపథ్యంలో ఇక షర్మిలకు ‘నారా’ వారి కుటుంబంతో సంబంధం కలిపేసి, ఆమె పై పచ్చ ముద్ర వేసేసి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న నారా CBN అంటూ కథనాలు ప్రచారం చేసారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా వైస్ జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం అమలు చేయలేక ఆ నిందను ‘నారా’ వారికే అంటగట్టారు జగన్ అండ్ కో.ఇక ఇక్కడితో వైస్ జగన్, నారా చంద్రబాబు నాయుడి మీద కక్కిన విషం పూర్తి కాలేదు అన్నట్టుగా బాబు తమ్ముడి మరణంలోనూ నారా జపమే చేస్తుంది సాక్షి.

నారా చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడి మరణంలోనూ సాక్షి రాజకీయమే చేస్తూ కనీసం మానవ సంబంధాల మధ్య ఉన్న విలువలను కూడా దిగజారుస్తుంది. కుటుంబ సభ్యులను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చాల్సింది పోయి ఆ కుటుంబం మీద రాజకీయ విమర్శలు చేస్తూ సైకో ఆనందాన్ని అనుభవిస్తుంది సాక్షి.

తల్లి, చెల్లితో సొంత కుటుంబంలో ఏర్పడిన వివాదాలను పరిష్కారించుకోవడం చేతకాక నారా వారి మీద నిందలు వేసి రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తున్న జగన్ ఇతర కుటుంబ సభ్యుల వివాదాల మీద సమీక్షలు చేసే అర్హతను కలిగివుంటారా.?

ప్రతి దానిలోనూ రాజకీయమే, ప్రతిదీ నారా వారి ప్రమేయమే అన్నట్టుగా జగన్ చేస్తున్న ఈ వికృత రాజకీయం చూస్తుంటే, సాక్షి చేస్తున్న ఈ విష ప్రచారం వింటుంటే జగన్ కు, సాక్షికి ‘నారాయణలో కూడా నారా’ మాత్రమే కనిపిస్తుందా…నారా మాత్రమే వినిపిస్తుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Mass H-1B Layoffs at Fortinet?

A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…

2 hours ago

H-1B Applicant Arrested Over False Walmart Accusation

An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…

3 hours ago