విలక్షణ సినిమాలలో నటించే నారా రోహిత్ చాలా కాలం తర్వాత ‘సోలో’ వంటి ఒక రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “సావిత్రి” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రోహిత్ సరసన నందిత హీరోయిన్ గా నటించింది. నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా విడుదలైన ఆడియో సందర్భంగా ధియేటిరికల్ ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపుదిద్దుకుందని ట్రైలర్ స్పష్టం చేసింది. అంతేకాదు, ట్రైలర్ కటింగ్ సినిమా విజయంపై నమ్మకాన్ని పెంచింది. సింపుల్ అండ్ మ్యాన్లీ లుక్ తో యధావిధిగా నారా రోహిత్ డైలాగ్స్ ఆకట్టుకుంటుండగా, తన పెద్ద పెద్ద కళ్ళతో నందిత మరోసారి వీక్షకులను పడేయడానికి సిద్ధమవుతోంది. అలాగే ట్రైలర్ లో చూపించిన ఫ్యామిలీ ఎలిమెంట్స్ సినిమా పక్కా కమర్షియల్ హిట్ అవుతుందన్న అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో కలిగేలా చేస్తోంది.



