Telugu

బీజేపీ అధిష్టానం వైఖరి… ఎందుకిలా?

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో బీజేపీని దాని అధిష్టానమే కూర్చొన్న కొమ్మని నరుకొన్నట్లు స్వయంగా దెబ్బ తీసుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. బీజేపీ అధిష్టానం నిర్ణయాలు, వైఖరి వలన రెండు రాష్ట్రాలలో బీజేపీ ఏవిదంగా నష్టపోతున్నాయనే విషయం ‘ఏపీ బీజేపీ పరిస్థితి ఏమిటి?’ అనే కధనంలో చెప్పుకొన్నాము.

కనుక ‘బీజేపీ అధిష్టానం ఇలా ఎందుకు చేస్తోంది?’అనే ప్రశ్నకు సమాధానం వెతికితే, కొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.

ADVERTISEMENT

వాటిలో ముందుగా చెప్పుకోవలసింది ఏమిటంటే, బీజేపీ అధిష్టానానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో అధికారంలోకి రావడం కంటే కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రావడమే చాలా చాలా ముఖ్యం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది గనుకనే ఏపీ, తెలంగాణలతో సహా పలు రాష్ట్రాలలో రాజకీయాలను బీజేపీ శాశించగలుగుతోంది.

ఒకవేళ లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ, ఎన్డీయే కూటమి గెలిచి మళ్ళీ అధికారంలోకి రాగలిగితే మంచిదే. కానీ రాలేకపోతే?

తెలంగాణలో ఎంతగా పోరాడినా బీజేపీ మళ్ళీ 3-4 లోక్‌సభ స్థానాలు మాత్రమే గెలుచుకోగలదు. ఇక ఏపీలో 25 స్థానాలలో మహా అయితే ఒక్కటి గెలుచుకోగలదేమో?కనుక ఒకవేళ బయట మద్దతు అవసరమైతే అందుకు బిఆర్ఎస్, వైసీపి లేదా టిడిపి ఎంపీలు చాలా అవసరం.

గతంలో తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించుకొనేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం ఏవిదంగా ఏపీ కాంగ్రెస్‌ను పణంగా పెట్టిందో, ఇప్పుడు బీజేపీ అధిష్టానం కూడా కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ఏపీ, తెలంగాణ బీజేపీలను పణంగా పెట్టేందుకు సిద్దమవుతోందని భావించవచ్చు.

అయితే ఏపీలో జనసేన, టిడిపిలకు అండగా నిలిచి తర్వాత వాటి మద్దతు పొందవచ్చు కదా? కానీ వైసీపి వైపు ఎందుకు మొగ్గుచూపుతోంది?అంటే వాటి కంటే కేసులు, అప్పుల కోసం తమ దయాదాక్షిణ్యాలపైన ఎల్లప్పుడూ ఆధారపడే వైసీపి ప్రభుత్వమైతే తోక జాడించకుండా విధేయంగా ఉంటుందని బీజేపీ అధిష్టానం భావించడం సహజమే కదా? అందుకే తెలంగాణలో బిఆర్ఎస్, ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీల పట్ల బీజేపీ అధిష్టానం మెతక వైఖరి అవలంభిస్తోందని భావించవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Bigg Boss Telugu: ROSHA Breakup Confirmed?

Rohith is one of the potential Bigg Boss Telugu contestants who could win the title.…

39 minutes ago

Rajinikanth-Vidya Balan Flirting: What Was Nelson Thinking?

Right from the first show of Rajinikanth's anticipated sequel Jailer 2, social media has been…

1 hour ago