
జగన్ ప్రభుత్వానికి ఆయన పట్ల రాజకీయ ద్వేషం, రాజకీయ శతృత్వం ఉంది కనుక ఈవిదంగా వ్యవహరిస్తుండటం సహజమని సరిపెట్టుకోవచ్చు. కానీ మూడుసార్లు ముఖ్యమంత్రి సేవలందించిన చంద్రబాబు నాయుడు పట్ల కోర్టులు కూడా ఈవిదంగా వ్యవహరిస్తుండటమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఆయనేమి కరడుగట్టిన హంతకుడో, ఉగ్రవాదో కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధించాలని కోరుకొనే రాజకీయ స్వాప్నికుడు. ఐటి రంగాన్ని అభివృద్ధి చేసి ఎన్నో లక్షల కుటుంబాలలో వెలుగులు నింపిన వ్యక్తి. ఈ వయసులో కూడా నిత్యం ప్రజల మద్య తిరిగే వ్యక్తి.
అటువంటి వ్యక్తిని నేరం చేసిన్నట్లు నిరూపించకుండానే జ్యూడిషియల్ రిమాండ్ పొడిగిస్తుండటం, బెయిల్ తిరస్కరిస్తుండటం చూసి సామాన్య ప్రజలు సైతం ఆవేదన చెందుతున్నారు. జగన్ ప్రభుత్వం రాజకీయకక్షతో ఆయనపై కేసులు నమోదు చేస్తే, మరి కోర్టులు ఏమి చేస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. కనీసం ఆయనకు బెయిల్ ఇవ్వకుండా ఎందుకు రిమాండ్ పొడిగిస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. న్యాయస్థానాలు రాజకీయ ఒత్తిళ్ళకు అతీతంగా పనిచేస్తాయని ప్రజలు ప్రగాడ నమ్మకం. కానీ చంద్రబాబు నాయుడు విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్న ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల రోజులలో జరిగిన ఈ కేసుల విచారణలు, వాయిదాలు, జ్యూడిషియల్ రిమాండ్ పొడిగింపు, బెయిల్ తిరస్కరణలు గమనిస్తే చంద్రబాబు నాయుడుకి బెయిల్ లభించే అవకాశంలేదనే అనిపిస్తోంది. కనుక వీటి గురించి మీడియాలో వస్తున్న ‘నరాలు తెగే ఉత్కంఠ వార్తలు’ కాలక్షేప వార్తాలే అని భావించవచ్చు.
చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైలుకి పంపిన తర్వాత తొలిసారిగా నేడు ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ కాబోతున్నారు. కనుక వారి భేటీ తర్వాత చంద్రబాబు నాయుడు విషయంలో తాడో పేడో తేలిపోవచ్చు.
ఒకవేళ వారు జగన్‌ను మందలిస్తే ఈ కేసుల నుంచి చంద్రబాబు నాయుడుకి వెంటనే విముక్తి లభించవచ్చు. ఒకవేళ వారు తమ పార్టీలకు ఇది రాజకీయంగా చాలా అవసరమని, మేలు కలిగిస్తుందని భావిస్తే చంద్రబాబు నాయుడుకి విముక్తి లభించకపోవచ్చు. కనుక నిర్ణయం ఇక్కడ కాదు… అక్కడ ఢిల్లీలో జరగాల్సి ఉంటుంది. బహుశః ఒకటి రెండు రోజులలోపే చంద్రబాబు నాయుడు విషయంలో స్పష్ఠత రావచ్చు.
Ranabaali Review: History Without Heart A film rooted in heart-wrenching stories is let down by…
Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…