
ఏపీలో నాలుగు జిల్లాల్లో కేంద్ర ఎన్నికల సంఘం కోడ్‌ను సడలించింది. తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఈ మినహాయింపు ఇచ్చింది. ఫొని తుపాను నేపథ్యంలో సహాయక చర్యలు, పునరావాస చర్యలు ముమ్మరంగా సాగించేందుకు వీలుగా కోడ్‌ను సడలించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీ చేశారు. అయితే కోడ్ మినహాయింపు ఎప్పటి వరకు అమల్లో ఉంటుందనే వివరాలు ఈసీ పేర్కొనలేదు.
ఇప్పటికే ఫొని తుపాను నేపథ్యంలో ఒడిశాలో కోడ్‌ను సడలించిన సంగతి తెలిసిందే. అక్కడ సడలించి ఇక్కడ సడలించకపోతే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉన్నందున ఆంధ్రప్రదేశ్ కు కూడా ఈ మినహాయింపు ఇచ్చారు. మొత్తానికి కారణం ఏదైతేనేమి ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన కక్షసాధింపుకు కొంత బ్రేక్ ఇచ్చారు. ప్రధాని మనసు కరగడానికి తుఫాను రావాల్సి వచ్చింది. ఫొని తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళంలో ఎక్కువగా ఉంది.
Delhi Capitals kept their IPL 2026 playoff hopes alive with a thrilling 3 wicket victory…
The YSRCP’s current obsession with where the CM and Deputy CM spend their weekends is…