Telugu

లోక్‌సభ ఎన్నికలకు బిజెపి అజెండా అదేనా?

వచ్చే ఎన్నికలలో బిజెపి ‘ఉమ్మడి పౌరస్మృతి’ (దేశంలో అన్ని మతాలకు ఒకటే చట్టం) అంశాన్ని భుజానికెత్తుకోబోతోందని ప్రధాని నరేంద్రమోడీ తాజా ప్రసంగంలో బయటపెట్టారు.

భోపాల్‌ జరిగిన పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగిస్తూ, “ఓ కుటుంబంలో ఒకరికి ఒక నియమ నిబందనలు, మరొకరికి మరో రకమైన నిబందనలు ఉండవు కదా?మన దేశంలో కూడా అందరికీ ఒకే రకమైన చట్టం, న్యాయం ఉండాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు కూడా చెప్పింది.

ADVERTISEMENT

ఒక్కో మతానికి ఒక్కో చట్టం, న్యాయం అంటే ఈ దేశం ఎలా నడుస్తుంది?కానీ అందరికీ ఒకే చట్టం అమలుచేయాలని మేము కోరుతుంటే, ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే కొందరు ముస్లిం నేతలు అభ్యంతరాలు చెపుతున్నారు.

మేము ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడి వారికి భద్రత కల్పించడానికి ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తే అప్పుడూ వారు ఇలాగే అడ్డుపడ్డారు. ఏం… ముస్లిం మహిళలకు సుఖంగా, ప్రశాంతంగా జీవించే హక్కు ఉండకూడదని వారు భావిస్తున్నారా?

దేశంలో ముస్లింలు ఎప్పటికీ చదువుల్లో, ఉద్యోగాలలో, చివరికి జీవితంలో కూడా అందరికంటే వెనుకబడి ఉండిపోవాలని కోరుకొంటున్నారా ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్న ముస్లిం నేతలు?” అంటూ ఉమ్మడి పౌర స్మృతి గురించి మనసులో మాట బయటపెట్టారు.

బిజెపి అజెండాలో అనేక అంశాలలో ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామ మందిరం నిర్మాణం వంటి కొన్నిటిని ఇప్పటికే మోడీ ప్రభుత్వం అమలుచేసింది. ఇప్పుడు దీనిని కూడా అమలుచేసేందుకు సిద్దం అవుతున్నట్లు మోడీ తొలి సంకేతం ఇచ్చారు.

ముస్లిం నేతలు, కొన్ని పార్టీలు ముస్లింలతో ఓటుబ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో ఈ అంశం తెరపైకి తీసుకువచ్చి, హిందూ ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నిస్తున్నారని మజ్లీస్‌ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపిస్తున్నారు.

ఒకవేళ మోడీ దేశప్రజలందరికీ ఒకే రకమైన చట్టాలు ఉండాలనుకొంటే ముందుగా పంజాబ్‌లో సిక్కులను ఒప్పించి అక్కడ అమలుచేయాలని సవాలు విసిరారు. నిజానికి ఆయన ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావాలనుకోవడం లేదు. ఇస్లాం షరియత్‌ చట్టాలను తొలగించి హిందూ చట్టాలను చేయాలని యోచిస్తున్నారు,” అంటూ అసదుద్దీన్ ఓవైసీ ఆక్షేపించారు.

ఈ ప్రతిపాదనను తాము ఎట్టి పరిస్థితులలో అడ్డుకొంటామని అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. అంటే ఈ అంశంపై హిందూ ముస్లింల భావోద్వేగాలు రగిలించబోతున్నట్లు స్పష్టమవుతోంది. దాని వలన జరిగే అనర్ధాలను పక్కన పెడితే, ఈ అంశంతో రాజకీయ లబ్ధి పొందేందుకు అన్ని పార్టీలు ప్రయత్నించడం ఖాయమే.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Kappi Squad Review: Average but Watchable Urban Comedy

BOTTOM LINE Average but Watchable Urban Comedy PLATFORM JioHotstar RUNTIME 1 Hour 73 Mins (4…

6 minutes ago

King 100: Nagarjuna’s Strong Take on Pan India

Nagarjuna’s upcoming film King 100 is currently planned as a Telugu film and not a…

21 minutes ago