
ఆర్థిక సాయం కాకున్నా, కనీసం రీ షెడ్యూలింగ్ కో, చెల్లింపుల వాయిదాకో ఆర్బీఐని ఒప్పించాలన్న కోరికను కూడా మోడీ పరిగణనలోకి తీసుకోలేదు. కష్టాల్లో ఉన్నాం, కనికరించండని వేడుకున్నా పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు తన సొంత లబ్ధి కోసం ఉత్తరప్రదేశ్ లో రుణమాఫీ హామీ ఇవ్వడమే కాకుండా దానిని భరించేందుకు కూడా కేంద్రం సిద్ధమైంది. యూపీ రుణభారాన్ని కేంద్రం మోస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ గురువారం నాడు లోక్‌సభలో ప్రకటన చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
అంతేకాదు రైతులకు రాష్ట్రాలు రాయితీ ఇవ్వాలనుకోవడం అభినందించాల్సిన విషయమని పేర్కొన్నారు. సదరు మంత్రి గారి ప్రకటనతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భగ్గుమంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా రుణమాఫీ ప్రకటించింది రైతులకేనన్న విషయం కేంద్రానికి తెలియదా? ఉభయ తెలుగు ప్రభుత్వాలు కేంద్రాన్ని కలిసి ఈ విషయంలో నిలదీయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు లోక్‌సభలో 90 నిమిషాలు మాట్లాడిన రాధామోహన్‌సింగ్ ఇతర రాష్ట్రాల్లోని రుణమాఫీ భారాన్ని కేంద్రం భరిస్తుందన్న ప్రస్తావన తీసుకురాకపోవడం గమనార్హం. దీంతో మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రా? లేక యూపీకా? అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
Allari Naresh is officially back in top form with Ramba Oorvasi Menaka, reminding everyone of…
The Congress leadership took the tough call of firing Konda Surekha from her Cabinet position…