మోడీని అనుసరిస్తున్న కేసీఆర్…

Two-Shades-of-TS-Govt's-Commitment-to-Environment-on-A-Single-Dayమొన్న ఆ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ గాంధీ జయంతి నుండి దేశంలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చెయ్యబోతున్నట్టు ప్రకటించారు. అయితే అసలే దేశం ఆర్ధిక మందగమనంతో సతమతం అవుతున్న తరుణంలో ఇటువంటి పెద్ద నిర్ణయం తీసుకోవడం పరిశ్రమలకు ఇబ్బంది అని ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది కేంద్ర ప్రభుత్వం.

ప్రస్తుతానికి ప్లాస్టిక్ వల్ల వచ్చే నష్టాల గురించి ప్రజలకు బాగా చెప్పి వారిని వాడుక తగ్గించేలా ప్రోత్సహించాలని నిర్ణయించారు. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి భిన్నంగా ప్లాస్టిక్ బ్యాన్ దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు.

ADVERTISEMENT

మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ప్రగతిభవన్‌లో సమీక్ష లో పర్యావరణంపై చర్చ సందర్భంగా మానవాళికి, జీవకోటికి ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్‌ను నిషేధించాలని సీఎం నిర్ణయించారు. దీనికి అవసరమైన విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. దీనిని కేబినెట్ ముందు పెట్టి ఆమోదిస్తాం అని చెప్పారు.

మరి మోడీ చెయ్యడానికి భయపడ్డ పనిని కేసీఆర్ సమర్ధవంతంగా చెయ్యగలరేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories