ఓడించిన వ్యక్తిని అభినందించడం… సంస్కారం అంటే ఇది కదా?

బుధవారం తమ ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావలసిందిగా ఆహ్వానించేందుకు చంద్రబాబు నాయుడు స్వయంగా మాజీ సిఎం జగన్మోహన్‌ రెడ్డికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తలేదు. జగన్‌ ఫోన్ ఎత్తి ఉంటేనే ఆశ్చర్యపోవలసి ఉంటుంది. చంద్రబాబు నాయుడుపై ఆయనకున్న ద్వేషం అంతా ఇంతా కాదు. ఆయనను రాజకీయంగా చావు దెబ్బతీయాలని ప్రయత్నించారు. కానీ ఆయన చేతిలోనే చావు దెబ్బ తినడంతో ఎంతగా కుమిలి రగిలిపోతున్నారో ఊహించుకోవచ్చు. కనుక చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జగన్‌ వస్తారనుకోవడం అవివేకమే అవుతుంది.

జగన్‌ వంటి అవ లక్షణాలే ఉన్న కేసీఆర్‌ కూడా రేవంత్‌ రెడ్డి ఆహ్వానాలని పట్టించుకోవడం లేదు. ప్రమాణ స్వీకారానికి రాకపోయినా కనీసం శాసనసభ సమావేశాలకు రావాలని పిలుస్తున్నా వెళ్ళకుండా కేసీఆర్‌ మొహం చాటేస్తున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఆహ్వానిస్తే దానికీ కేసీఆర్‌ మొహం చాటేశారు. కారణం అందరికీ తెలిసిందే. ఆయన కూడా జగన్‌లాగే తనకు తిరుగులేదనుకుని బోర్లా పడ్డారు. తనను ఓడించి మూలకూర్చోబెట్టినందుకు ఆయన రేవంత్‌ రెడ్డి పేరు కూడా పలకరు. అంతా కేసీఆర్‌ రేవంత్‌ రెడ్డిని ద్వేషిస్తుంటారు.

ADVERTISEMENT

రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు ఈవిదంగా ఉంటే, ఒడిశాలో ఇందుకు పూర్తి భిన్నంగా ఉండటం విశేషం. ఒడిశా రాష్ట్రాన్ని సుమారు 24 ఏళ్ళుగా నవీన్ పట్నాయక్ పరిపాలిస్తున్నారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికలలో బీజేపీ చేతిలో ఓడిపోయి అధికారం కోల్పోయారు. దీంతో తొలిసారిగా ఒడిశాలో మోహన్ చరణ్ మఝీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోంది.

ఆయన శాసనసభా పక్ష నేతగా ఎన్నికవగానే మొట్టమొదట నేరుగా నవీన్ పట్నాయక్ ఇంటికి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావలసిందిగా ఆహ్వానించారు. కానీ ఆయన వస్తారని ఎవరూ ఆశించలేదు. కానీ వచ్చారు.

తమ చేతిలో ఓడిపోయి అధికారం కోల్పోయిన నవీన్ పట్నాయక్ తమ ఆహ్వానాన్ని మన్నించి రావడంతో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కారీ, జేపీ నడ్డా అందరూ ఆయనకు ఎదురేగి సాదరంగా తోడ్కొని తీసుకొని వచ్చారు. ఆయన కూడా ఎటువంటి బేషజాలు చూపకుండా వారందరినీ పలకరించారు. అనంతరం ఆయన కుర్చీలో కూర్చున్న తర్వాతే అందరూ కూర్చున్నారు.

ఆ తర్వాత మోహన్ చరణ్ మఝీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోడీ తదితరులకు నమస్కరించిన తర్వాత నవీన్ పట్నాయక్ వద్దకు వచ్చి నమస్కరించగా ఆయన అభినందనలు తెలిపి ఆశీర్వదించారు.

ఇది చూసినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటువంటి సంస్కారవవంతమైన రాజకీయాలు ఎప్పటికైనా చూడగలమా? అనిపిస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఈ 10 డీఎస్సీ కాదు.. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లే!

జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఎదురుచూస్తున్న రాష్ట్రంలో యువతకు వాటి గురించి పూర్తి స్పష్టత ఉంది. కానీ ఐదేళ్ళు సిఎంగా రాష్ట్రాన్ని…

11 minutes ago

Is Rashmika Mandanna India’s No. 1 Actress?

Director Rahul Sankrityan had some big words for Rashmika Mandanna at the Ranabaali pre-release event.…

39 minutes ago