
Rahul Gandhi's arrest has intensified the NEET protest, turning it into a direct political confrontation between the BJP and Congress.
నీట్ పరీక్షా పత్రాల లీకేజ్ కు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ మొదలైన కాక్రోచ్ పార్టీ ఉద్యమం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హస్తంలో వెళ్లిపోతుందా అన్న చర్చ నడుస్తుంది.
బీజేపీ vs సిజేపీ అన్నట్టుగా మొదలైన ఈ రాజకీయ పోరాటం ఇప్పుడు రాహుల్ ఎంట్రీ తో బీజేపీ vs కాంగ్రెస్ గా మారిపోతుంది. నిన్న ఢిల్లీ నిరశన కార్యక్రమంలో పాల్గొన రాహుల్ గాంధీ ముక్కు నుండి రక్తం కారుతున్న ఫొటోస్, వీడియోస్ వైరల్ కావడం, రాహుల్ అరెస్టు వంటి సంఘటనలకు గాను బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు నిరశన చేపట్టారు.
ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం రోడ్ల మీదకు వచ్చి రాహుల్ కి మద్దతుగా కాంగ్రెస్ గళం వినిపించారు. దేశంలో ఇప్పుడు జరుగుతున్న ఈ ఉద్యమం కాంగ్రెస్ vs బీజేపీ కాదని గాంధీ vs గాడ్సే వారసుల మధ్య సాగుతున్న యుద్దమంటూ ప్రకటించారు.
అలాగే దేశం కోసం, దేశ ప్రజల కొసం గాంధీ కుటుంబం రక్తం చిందించడం కొత్తేమి కాదని, నిన్న పోలీసుల లాఠీ దెబ్బలతో రాహుల్ గాంధీ రక్తం బీజేపీ కళ్లచూసిందంటూ మండిపడ్డారు రేవంత్. ఇక ఇటు ఎన్డీయే ప్రభుత్వంలో భాగమైన ఏపీలో కూడా కాంగ్రెస్ – బీజేపీ నాయకుల మధ్య కర్రలు, చెప్పులు, వాటర్ బాటిళ్లతో దాడులు జరుగుతున్నాయి.
విజయవాడ కేంద్రంగా రెండు పార్టీల శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రాహుల్ అరెస్టు కు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు కథం తొక్కితే, రాహుల్ నాయకత్వంలో మోడీ ఇంటి ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ విధానాలను ఎండగడుతూ బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ కార్యలయం ముట్టడికి పిలుపునిచ్చారు.
దీనితో ఇరు వర్గాల మధ్య విమర్శలు కాస్త దాడులకు దారి తీశాయి. అటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా సీజేపీ తో సమానంగా కాంగ్రెస్ నిరశన కార్యక్రమాలు చేపడుతుంది. ఇలా కాక్రోచ్లు మొదలుపెట్టిన ఈ ఉద్యమం రాహుల్ అరెస్టు తో కాంగ్రెస్ హస్తంలోకి వెళ్ళిపోతుంది.
అయితే బీజేపీ కూడా వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ శ్రేణులను రెచ్చకొడుతుందా.? దేశంలో బీజేపీ, కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా మరోకొత్త రాజకీయ పార్టీ రాజకీయ తెరమీద కనిపించకుండా ఉండేందుకు బీజేపీ పెద్దలే ఈ ఉద్యమాన్ని కాంగ్రెస్ చేతులకు అందిస్తున్నారా.? లేదా రాహుల్ గాంధీనే అందివచ్చిన అవకాశాన్ని తనకు, తన పార్టీకి అనుకూలంగా మలచుకుంటున్నారా.?
The Varanasi promotions are starting to feel like a controlled game. Only Rajamouli, Priyanka Chopra…
Drishyam: The Conclusion is creating a lot of buzz with a few more days left…