Telugu

నీట్: నాడు విద్యార్థులకు – నేడు మోడీ సర్కార్ కు అగ్నిపరీక్షేనా.?

ఢిల్లీలో మొదలైన సీజేపీ నిరశనలు మెల్లిమెల్లిగా దేశం మొత్తం వ్యాపించేలా కనిపిస్తున్నాయి. సీజేపీ నిరశన కు మద్దతుగా హైద్రాబాద్ లో కూడా ఉద్యమం ఊపందుకుంది. నీట్ పరీక్ష నాడు విద్యార్థులకు అగ్ని పరీక్ష గా మారితే నేడు అదే నీట్ మోడీ సర్కార్ కు రాజకీయంగా అగ్నిపరీక్షను ఎదుర్కోవాల్సిన పరిస్థితిని తెచ్చింది.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో మొదలైన ఈ సీజేపీ ఉద్యమం నేడు ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా డిమాండ్ వరకు చేరింది. ఢిల్లీ వీధులు ఉద్యమకారుల నిరసనలతో అట్టుడుకుతున్నాయి. అటు పోలీసులు తగ్గేదెలా అన్నట్టుగా పరిస్థితిని అదుపు చేసేందుకు తమ లాఠీలకు పని కల్పిస్తున్నారు.

ADVERTISEMENT

సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీగా పుట్టుకొచ్చిన ఈ సీజేపీ ఇప్పుడు బీజేపీ సర్కారు పాలిట హిట్ గా మారిపోయింది. సీజేపీ ఉద్యమం తీవ్ర తరం కావడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధన్ రాజీనామా కు మోడీ సర్కార్ తలవంచుతుందా.? లేదా సీజేపీ నేతలను తమ డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గేలా చేస్తుందా.?

ఇనాళ్ళకు దేశంలో తమ రాజకీయాలతో ప్రత్యర్థుల నోళ్లకు తాళాలు వేసి ఏకచక్రాధిపత్యం వహించిన బీజేపీ ఇప్పుడు బొద్దింక పార్టీ డిమాండ్లకు తలవంచితే అది సీజేపీ గెలుపే అవుతుంది. ఆ గెలుపు బీజేపీ వ్యతిరేక శక్తులకు బీజేపీ పై పోరాడే నైతిక బలాన్ని అందిస్తుంది.

ఆ బలమంతా ఒక రాజకీయ శక్తిగా మారితే రానున్న కాలంలో బీజేపీ కి రాజకీయంగా బలమైన ప్రత్యర్థి ఎదురయినట్టే అవుతుంది. మరి విద్యార్థులకు రీ ఎక్సమ్ ఉన్నట్టుగా ప్రభుత్వాలకు రీ ఎన్నికలు ఉండవు కాబట్టి మోడీ సర్కార్ ఈ సీజేపీ నడుపుతున్న ఉద్యమం అనే పరీక్షను ఎట్టి పరిస్థితులలో ఎదుర్కోవాల్సిందే, అందులో ఉత్తీర్ణత సాధించాల్సిందే.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Himesh Returns with 5 Big Films: Much Needed Comeback?

Himesh Reshammiya appears ready to reclaim his place in Bollywood’s music scene, and the timing…

23 minutes ago

India Won Series: Kerala Star Shuts Down Haters

India beat Afghanistan by 7 wickets in the second T20I in Delhi to take an…

9 hours ago