ఈ మధ్యకాలంలో సినిమాల అభిరుచుల పై ప్రేక్షకులలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి…కనిపిస్తున్నాయి. సినిమా విడుదల సమయంలో మిక్సడ్ or నెగిటివ్ టాక్ తో మొదలయ్యి అదే సినిమా పోనుపోను వసూళ్ళలో పాజిటివ్ కలెక్షన్లు రాబడుతున్నాయి.
దీనికి మంచి ఉదాహరణ రీసెంట్ గా విడులయ్యి ఆడియన్స్ ను డిసపాయింట్ చేసి నిర్మాతలను ఒడ్డునపడేసిన మహేష్, త్రివిక్రమ్ ల గుంటూరు కారం. ఎప్పుడు మహేష్ యాక్టింగ్ లో కొత్తదనాన్ని చూపించే త్రివిక్రమ్ ఈ మూవీతో మహేష్ ఊరమాస్ ఎంట్రీని చూపించబోతున్నారు అని ఎదురుచూసిన మహేష్ అభిమానులకు ఆశించిన మహేష్ ఉరమస్ లుక్ అయితే దొరికింది కానీ కథను తెరకెక్కించే విషయంలో దర్శకుడు శ్రద్ద పెట్టలేదనే అపవాదనైతే త్రివిక్రమ్ మూటకట్టుకున్నారు.
దీనితో గుంటూరు కారం పై నెగటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది. కానీ మహేష్ కట్ అవుట్ తో టాక్ నెగిటివ్ ఉన్నప్పటికీ వసూళ్ళలో పాజిటివ్ రిజల్ట్ తీసుకురాగలిగారు. దీనితో మూవీ నిర్మాత నాగ వంశీ ఒడ్డునపడ్డారనే టాక్ నడిచింది. ఇలానే సందీప్ వంగా దర్శత్వంలో తెరకెక్కిన యానిమల్ మూవీ కూడా మిక్సడ్ టాక్ తో మొదలయ్యి కలెక్షన్ల దుమ్ము దులిపింది.
ట్రైలర్ రిలీజ్ తరువాత ప్రేక్షకులలో వచ్చిన పాజిటివ్ వైబ్రేషన్స్ ను మూవీ ప్రమోషన్స్ లో మరో లెవెల్ కి తీసుకువెళ్లారు చిత్ర దర్శకుడు సందీప్. “తండ్రి కొడుకుల ప్యూర్ లవ్ స్టోరీ” అంటూ సినిమాను ప్రమోట్ చేసిన చిత్ర యూనిట్ కి కనెక్ట్ అయ్యి థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు యాక్షన్ అండ్ అడల్ట్ కంటెంట్ మూవీని చూపించారు. దీనితో పార్లమెంట్లో సైతం ఈ మూవీ మీద చర్చ జరిగింది.
ఒక సెక్షన్ అఫ్ ఆడియన్స్ ను బేస్ చేసుకుని సందీప్ ఇటువంటి సినిమాలను తెరకెక్కిస్తున్నారంటూ మహిళలు తీవ్ర స్థాయిలో యానిమల్ మూవీ పై నెగటివ్ కామెంట్స్ చేసారు. సందీప్ గత సినిమా అర్జున్ రెడ్డి విడుదల సమయంలో కూడా వంగా ఇటువంటి విమర్శలే ఎదుర్కొన్నప్పటికీ అవి సినిమా కలెక్షన్లకు అడ్డుకట్టవేయలేకపోయాయి. యానిమల్ మూవీ కూడా ఓపినింగ్ నుండి తన వసూళ్ల వేట మొదలుపెట్టి పాత రికార్డులను బద్దలుకొట్టింది.
అలాగే ‘పుష్ప ది రైసింగ్’ మూవీ కూడా విడుదల సమయంలో బాలీవుడ్ లో నెగటివ్ టాక్ తో మొదలుపెట్టి ఆ తరువాత పుష్ప తగ్గేదేలే…,అంటూ నాన్ బాహుబలి రికార్డ్స్ సెట్ చేసి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకునే స్థాయికి అల్లు అర్జున్ ను తీసుకువెళ్ళింది పుష్ప. అలాగే బాహుబలి సినిమా తరువాత సాహో తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రభాస్ పరిస్థి కూడా మిక్సడ్ రిజల్ట్ నే చవిచూడాల్సి వచ్చింది. తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయిన సాహో బాలీవుడ్ లో మాత్రం మంచి వసూళ్లు రాబట్టింది.
ఇలా నెగిటివ్ టాక్ తో పాస్టివ్ కలెక్షన్లు రాబట్టిన మూవీలు ఒకవేళ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఇంకెంత కలెక్షన్లు సాధించేవో..? మొత్తానికి కంటెంట్ లేకపోయినా కుట్ర అవుట్ తో లాక్కొచ్చిన హీరోలు నిర్మాతల పాలిట దేవుళ్ళనే చెప్పాలి.




