
2022లో తాను సినిమాల నుండి రిటైర్మెంట్ అవుతున్నానని ప్రకటించాడు రాహుల్. ఇప్పుడిప్పుడే టాప్ కమెడియన్ గా ఎదుగుతోన్న రాహుల్ నిర్ణయంపై నెటిజన్లు షాక్ అవ్వగా, కాసేపటికి దీనిపై వివరణ ఇచ్చుకున్నాడు. ‘ఓ ఫూల్స్… ఇది ఓ జోక్ మాత్రమే, లగ్జరీ లైఫ్ ఇచ్చే బెనిఫిట్స్, అత్యధిక సంపాదనను ఎవరు వదులుకుంటారని’ చెప్తూ మరో ట్వీట్ చేసాడు.
జోక్ అంటే నవ్వాలి గానీ, నవ్వులపాలు కాకూడదు అన్న విషయాన్ని ఈ అప్ కమింగ్ కమెడియన్ మరిచినట్లున్నారు. అందుకే ఈ కుళ్ళు జోకు ఏ మాత్రం రుచించలేదు. అయినా తనను అభిమానించే వారిని ”ఫూల్స్”గా కీర్తించడం వెనుక రాహుల్ ఉద్దేశం ఏమిటో? ఇలాంటి జోకులు సిల్వర్ స్క్రీన్ పైన వేస్తే పండుతాయేమో గానీ, రియల్ లైఫ్ లో కాదని తెలుసుకోవాలి.
సోషల్ మీడియాలో ప్రచారానికి సెలబ్రిటీలు వివిధ స్టంట్ లు చేస్తుంటారు. అందులో భాగంగా ఈ సంచలన ప్రకటన చేసి పబ్లిసిటీ ఆర్జించాలని చూసారో ఏమో గానీ, తనపై ప్రేక్షకులకున్న మంచి ఉద్దేశం కూడా పోయేలా చేసింది ఈ ప్రకటన. ఆర్జీవీ లాగా పబ్లిసిటీ స్టంట్ పర్ ఫెక్ట్ గా చేయడం అందరి వల్ల సాధ్యం అయ్యేది కాదని ఈ సందర్భంగా రుజువవుతోంది.
The H-1B situation in the US is showing the strain it puts on Indian tech…
Actor Rahul Ramakrishna has taken a sharp dig at the much-hyped world-building in recent big-budget…