
టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల పొత్తుతో కూటమి కట్టిన నేతలు వేసే పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అంటూ భీరాలు పోయిన వైస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు అనుసరిస్తున్న ధోరణి చూస్తే అర్జునుడు కాదు కదా కనీసం అభిమన్యుడి మాదిరి ప్రత్యర్థులతో పోరాడలేకపోతున్నారు అనిపిస్తుంది.
ఎదురుగా ఉన్నది మహా యోధులని తెలిసి, పద్మవ్యూహంలో అడుగు పెడితే తిరిగి వెనుకకు రాలేనని గ్రహించి, తన వయస్సు, యుద్ధ రంగంలో తన అనుభవం అన్ని బేరీజు వేసుకుని కూడా యుద్ధంలో వెన్ను చూపడం వీరుడి లక్షణం కాదని భావించి తన స్థాయికి మించిన పోరాటం చేసి మహా వీరుడిగా అభిమన్యుడు చరిత్ర కెక్కాడు.
కానీ అర్జునుడితో పోల్చుకున్న జగన్ మాత్రం ఓటమి దరిచేరగానే ప్రభుత్వంతో, అధికార పార్టీ నేతలతో తానూ పోరాడలేనన్ని చేతులెత్తేస్తు చట్ట సభల నుంచి భయంతో పారిపోతున్నారు. 2014 ఎన్నికలలో వైసీపీ పార్టీ కి ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ అప్పుడు ఏవో కుంటి సాకులు వెతుకుని శాసన సభకు వెన్ను చూపించి ఒక ప్రతిపక్ష నేతగా పోరాటం నుంచి తప్పుకున్నారు జగన్.
ఇప్పుడు 2024 లో జగన్ రాజకీయాలను గమనించిన ప్రజలు వైసీపీ పార్టీకి ఓటమితో పాటుగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసారు. ప్రజలు అనుకున్నట్టుగా, అధికార పార్టీ నేతలు ఊహించినట్టుగానే జగన్ ఈ ఓటమిలో కూడా చట్ట సభలలో ప్రజల తరుపున గళం వినిపించడానికి ఆసక్తి చూపించక, పులివెందుల ఎమ్మెల్యే భయపడుతున్నాడు అనే ఆరోపణలు మోస్తూ తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారు.
దీనితో అప్పుడు అర్జునుడిని అంటూ జబ్బలు చరుచుకున్న జగన్ ఇప్పుడు కనీసం అభిమన్యుడి మాదిరి కూడా పోరాడలేక భయపడి పారిపోతున్నారా అంటూ ఎన్నికల ప్రచారంలో జగన్ చేసిన వ్యాఖ్యలు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీని బట్టి జగన్ తానూ అనుకున్నట్టు అర్జునుడు కాదు…తానూ అనుకోని అభిమన్యుడు కాదు సరి కదా ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఒక సాధారణ పులివెందుల ఎమ్మెల్యే లా కూడా నడుచుకోలేకపోతున్నారు.
అసెంబ్లీ కి వెళితే అవమానం తప్పదని, గతంలో చేసిన పాపాలు ఇప్పుడు వెంటాడుతాయని, దానికి సమాధానము చెప్పే ధైర్యం లేక, తనను రక్షించే సైన్యం చాలక జగన్ వెనకడుగు వేస్తున్నారనేది సుస్పష్టం. అయితే తనను, తన పార్టీ ని నమ్మి 40 % మంది ప్రజలు వైసీపీకి ఓటేస్తే కనీసం అసెంబ్లీకి వెళ్లకుండా మీడియాలో కూర్చుంటా, ప్యాలస్ లో ప్రశ్నలడుగుతా అంటూ కళ్ళబుల్లి కబుర్లు చెపుతూ కాలక్షేపం చేస్తే ఈ సారి ఆ 11 కూడా గోవిందా గోవిందా అనుకోవాల్సిందేనా..!
Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set for a…
Vijay’s rise to power in Tamil Nadu has once again brought the spotlight on actors…