
మంత్రి రోజా మాట్లాడిన అంశాలపై నెటిజన్స్ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. బ్రాహ్మణి తన మావగారు హైదరాబాద్లో ఐటి రంగానికి బలమైన పునాది వేసి ఎంతో మందికి ఉద్యోగాలు లభించేలాచేశారని మాత్రమే చెప్పారు. అది వాస్తవం కూడా. హైదరాబాద్, బెంగళూరు, అమెరికాలో ఐటి ఉద్యోగులు కూడా చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలపడమే ఇందుకు తాజా నిదర్శనం.
అయితే ఆమెను ఎద్దేవా చేసేందుకు, “దేశంలో బెంగళూరు, చెన్నై, పూణే, ఢిల్లీ, కోల్కతా, అహ్మదాబాద్ ఇలా అనేక నగరాలలో, రాష్ట్రాలలో అనేక ఐటి కంపెనీలున్నాయి వాటిలో అనేక లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రాలన్నిటికీ ముఖ్యమంత్రిగా చేశారా? లేదా దేశానికి ప్రధానమంత్రిగా చేశారా?ఆ ఐటి కంపెనీలను, వాటిలో ఉద్యోగాలను ఆయనే కల్పించారా?” అని ప్రశ్నించారు.
ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు లేదేమిటని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ నాలుగున్నరేళ్ళలో మీ జగనన్న రాష్ట్రంలో ఉన్న ఐటి కంపెనీలను కూడా తరిమేశారుగా? రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటి కంపెనీలు లేకపోవడం, రాకపోవడం వలననే డిగ్రీలు చదివిన తర్వాత ఇరుగుపొరుగు రాష్ట్రాలకు వలసలు పోతున్నారని నెటిజన్స్ రోజాకు గుర్తు చేశారు.
“జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2.06 లక్షల మందికి శాస్విత ఉద్యోగాలు ఇచ్చారు. రెండు లక్షల మందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారు. 127 భారీ పరిశ్రమలు తీసుకువచ్చి వాటిలో 84 వేలమందికి ఉద్యోగాలు కల్పించారు. రెండు లక్షల చిన్న, మద్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయించి 12.60 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా 2 లక్షల మందికి ఉద్యోగాలు పొందేలా చేశారని,” మంత్రి రోజా అన్నారు.
అయితే ఆమె చెపుతున్న ఆ లక్షల ఉద్యోగాలన్నీ నెలకు రూ.5,000 జీతంతో పనిచేసే వాలంటీర్లే తప్ప ప్రభుత్వోద్యోగులో లేదా ఐటి ఉద్యోగులో కాదని అందరికీ తెలుసు. రాష్ట్రంలో 127 భారీ పరిశ్రమలు, ఏకంగా 2 లక్షల చిన్న, మద్య తరహా పరిశ్రమలు తమ ప్రభుత్వం ఏర్పాటు చేసి వాటిలో మొత్తం 13.44 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పగా, ఆ పరిశ్రమల పేర్లు, వివరాలు కూడా తెలపాలని నెటిజన్స్ ఆమెను సవాలు చేస్తున్నారు.
మార్చిలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో రాష్ట్రానికి రూ.13.56 లక్షల కోట్లు పెట్టుబడులు, వాటితో 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఇలాగే వైసీపి మంత్రులు గొప్పగా చెప్పుకొన్నారు. కానీ ఇంతవరకు వాటిలో ఒక్కటీ రాలేదు.
అసలు అభివృద్ధి పనులకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తుంటే, రాష్ట్రంలో ఎవరికీ తెలియకుండా 127 భారీ పరిశ్రలు, 2 లక్షల చిన్న, మద్యతరహా పరిశ్రమలు ఎప్పుడు, ఎక్కడ ఏర్పాటయిపోయాయి? వాటిలో ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తున్నప్పుడు మరి లక్షలమంది యువత డిగ్రీలు చేతపట్టుకొని ఉద్యోగాల కోసం ఇరుగు పొరుగు రాష్ట్రాలకు ఎందుకు వలసలు వెళుతున్నారు?అనే ప్రశ్నలకు మంత్రి రోజాయే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
స్కిల్ డెవలప్మెంట్ పెద్ద బోగస్, అంతా మోసం, దోపిడీ అని చెపుతూ చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేయిస్తే, అదే స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా రాష్ట్రంలో 2 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని మంత్రి రోజా చెప్పడం ద్వారా అప్రయత్నంగా వాస్తవం బయటపెట్టేశారు.
Ranbir Kapoor and Yash starrer mythological film Ramayana Part 1 will be hitting the screens…
Mitchell Starc's participation in IPL 2027 remains uncertain as Australia prepare for a demanding international…