శత్రువులు ఎక్కడో ఉండరు..చెల్లెళ్ళ రూపంలో మన చుట్టే ఉంటారా..?

తాను అధికార పీఠం అందుకోవడానికి తోడుగా నిలిచిన ఒక చెల్లి వైస్ షర్మిలను ఒక పక్క, ఎన్నికల ముందు బాబాయ్ హత్యతో రాజకీయ తెర మీదకు తెచ్చిన మరో చెల్లి సునీతా రెడ్డిని మరో పక్కన పెట్టుకుని నారాసుర రక్త చరిత్ర అంటూ ప్రజలలో సానుభూతిని సంపాదించిన వైస్ జగన్ కు ఇప్పుడు అదే చెల్లుల్లు తన రాజకీయ పతనానికి కారణంగా నిలుస్తారు అని ఉహించి ఉండరు. అదే మరి అసలైన దేవుడి స్క్రిప్ట్ అంటే అంటున్నారు టీడీపీ తమ్ముళ్లు..

ఇంటి ఆడపడుచు కన్నీరు ఆ ఇంటి పతనానికి నాంది పలుకుతుంది అనేది ఏళ్ళనాటి సామెత. ఇప్పుడు అదే సామెత జగన్ కు బాగా వర్తిస్తుందంటూ తెలుగు నాట చర్చ జరుగుతుంది. 2019 వరకు తన పార్టీ బలపడడానికి, పార్టీ ఎన్నికల ప్రచారానికి అండగా నిలిచిన చెల్లి షర్మిలను, తల్లి విజయ లక్ష్మిని అధికారం అందగానే పక్క రాష్ట్రానికి పంపేశారని జగన్ పై ఆరోపణలు బలంగా వినిపించాయి ప్రతిపక్షాలు.

ADVERTISEMENT

ఆ ఆరోపణలకు తగ్గట్టే షర్మిల కూడా తన రాజకీయ అడుగులు వేసుకుంటూ ముందుకు సాగుతుంది. జగన్ మరో చెల్లి సునీతా రెడ్డి తన తండ్రి హత్యకు జగన్ చెప్పినట్లుగా టీడీపీ కి సంబంధం లేదని సొంత కుటుంబసభ్యులే ఈ దారుణానికి పాల్పడ్డారంటూ కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పై ఆరోపణలు చేసి కోర్ట్ కెక్కారు. అవినాష్ రెడ్డి కి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయంటూ ఈ కేసుని సిబిఐ కు అప్పగించి విచారణను పక్క రాష్ట్రానికి తరలించాంటు సుప్రీం కోర్ట్ మెట్లెక్కి అనుకున్నది సాధించారు సునీతా.

వైస్సార్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది అంటూ ఇన్నాళ్లు చెప్పుకుంటూ ప్రజలలో సానుభూతి సృష్టించుకున్న జగన్ కు వైస్ షర్మిల “న్యూ ఇయర్ గిఫ్ట్” ఇచ్చారు. తన తండ్రి ఆశయ సాధనకే కాంగ్రెస్ చేయూత కోరుకుంటున్న అంటూ ఇన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ మీద జగన్ చెప్పినవన్నీ తియ్యటి అబద్ధాలని ప్రజలకు అర్థమయ్యేలా చేశారు షర్మిల. తోబుట్టువులు ఇచ్చిన ఊహించని షాక్ తో డైనమాలో పడ్డ జగన్ కొత్త వ్యూహాలను తెర మీదకు తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఇక ఇద్దరు చెల్లెల్లు జగన్ కు వ్యతిరేకంగా మారిపోవడంతో “శత్రువులు ఎక్కడో ఉండరు..చెల్లెళ్ళ రూపంలో మన చుట్టే తిరుగుతూ ఉంటారు” అంటూ చెప్పే సినిమా డైలోగ్ ను ఉదాహరణగా చూపిస్తూ అయ్యో పాపం జగన్ అంటూ జాలి పడుతున్నారు జగన్ అభిమానులు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

బూతులు కూడా తిట్టారటగా.. సగం సగం చెప్తే ఎలా సాయి?

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద లేఖ పోస్ట్ చేశారు. దానిని పూర్తిగా సజ్జల…

21 minutes ago

Dhurandhar Ruined Spy Universe: Is Karthi Next in Line?

Recently, the trailer of Karthi's most anticipated sequel Sardar 2 directed by PS Mithran, was…

28 minutes ago