టిడిపిలో విలీనం అయితే బెటర్ అట!

ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ బీజేపీలో బిఆర్ఎస్ పార్టీ విలీనం లేదా ఆ రెండు పార్టీల మద్య పొత్తులు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మొదలు సోషల్ మీడియా వరకు ఎక్కడ చూసినా ఇదే మాట!

వేరే సమయం, సందర్భంలో అయితే కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగేవారు. కేటీఆర్‌, హరీష్ రావులతో సహా బిఆర్ఎస్ పార్టీలో ముఖ్యనేతలు తలోవైపు నుంచి ఎదురుదాడులు చేస్తుండేవారు.

ADVERTISEMENT

కానీ ఇప్పుడు అందరూ సైలంట్! వారి మౌనం అర్ధాంగీకారంగా భావించి అందరూ కమ్మగా విలీన కబుర్లు చెప్పుకుంటున్నారు.

సోషల్ మీడియాలో కూడా వీటిపై జోకులు పేలుతూనే ఉన్నాయి.

ఓ నెటిజన్ ‘కాబోయే బిహార్‌ గవర్నర్‌ కేసీఆర్‌కి శుభాకాంక్షలు’ తెలియజేశాడు.

మరో నెటిజన్ కేసీఆర్‌ ఎదుర్కొంటున్న ఈ గడ్డు సమస్యకు చక్కటి పరిష్కారం చూపాడు. బిఆర్ఎస్ పార్టీ టిడిపిలో విలీనం అయిపోవడమే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం అంటూ చక్కగా విడమరిచి ఆ ప్రయోజనాలు చెప్పారు.

“బీజేపీలో చేరితే బండి సంజయ్‌, కాంగ్రెస్‌లో చేరితే రేవంత్‌ రెడ్డి కింద కేసీఆర్‌ తదితరులు పనిచేయాలి. ఇది చాలా కష్టం. కనుక మధ్యే మార్గంగా తెలంగాణ టిడిపిలో బిఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తే ఎవరి కిందా పని చేయక్కరలేదు.

పార్టీ పేరు, గులాబీ రంగు, గులాబీ కండువా వదిలేసుకుని పసుపు కండువా కప్పుకుంటే చాలు…. సిఎం రేవంత్‌ రెడ్డి మీ వెంటపడటం మానేస్తాడు. బీజేపీ కూడా మీ జోలికి రాదు.

రాష్ట్రంలో బిఆర్ఎస్ క్యాడర్‌తోపాటు టిడిపి క్యాడర్ మద్దతు కూడా మీకే లభిస్తుంది. ముఖ్యంగా సిఎం పదవి బయటకు పోకుండా కల్వకుంట్ల కుటుంబంలోనే ఉండిపోతుంది.

చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడు. ఏపీ ముఖ్యమంత్రిగా చాలా బిజీగా ఉన్నారు. కనుక తెలంగాణ టిడిపిని కేసీఆర్‌ నడిపిస్తానంటే వద్దనరు. తెలంగాణ రాజకీయాలలో జోక్యం చేసుకోరు కూడా.

బాగా ఆలోచించుకోండి… ఈ వయసులో కూడా ఇంత మానసిక ఒత్తిడి, ఆందోళన అవససరమా? ఆలస్యం చేయకుండా ఓ మంచి నిర్ణయం తీసుకోండి కేసీఆర్” అంటూ ఆ నెటిజన్ ఓ అమూల్యమైన ఉచిత సలహా ఇచ్చారు. ఈ సలహా, ఈ ఆప్షన్ బాగానే ఉందనిపిస్తోంది కదా?

నిజానికి ఓ మూడు నాలుగేళ్ళ క్రితం తెలంగాణ టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఇంచుమించు ఇలాంటి సలహాయే ఇచ్చారు.

కాకపోతే అప్పటికి రాష్ట్రంలో టిడిపి బలహీనపడి బిఆర్ఎస్ పార్టీ చాలా శక్తివంతంగా ఉండేది కనుక దానిలో టిడిపి విలీనం అయితే బాగుంటుందని మోత్కుపల్లి సలహా ఇచ్చారు. అది నచ్చక చంద్రబాబు నాయుడు ఆయనని పార్టీ నుంచి బహిష్కరించారు.

కానీ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ బలహీనపడింది కనుక టిడిపిలో విలీనం అవ్వాలనే ఈ నెటిజన్ సూచన, దాని వలన కలిగే ప్రయోజనాలను చూస్తే బాగానే ఉందనిపిస్తోంది.

అయినా అపర చాణక్యుడు కేసీఆర్‌కి కూడా తట్టని ఇటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు ఈ నెటిజన్స్‌కి మాత్రమే ఎలా తడతాయో?చాలా హా…హాశ్చర్యంగా ఉంది!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pic Talk: CM Vijay With CM CBN and Lokesh!

Neighbouring state, Tamil Nadu chief minister Thalapathy Vijay got on his way to Andhra Pradesh…

5 minutes ago

24-Year-Old NRI Found Dead In Great Smoky Mountains

Sahil Jilani, a 24 year old NRI from Houston, Texas, has been found dead by…

24 minutes ago