
వేసవి సెలవలు ముగించుకుని విద్యార్థులంతా బడి బాట పడుతున్న వేళ మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు ప్రాంతంలో పిల్లలకు అందుబాటులోకి వచ్చిన ఒక ప్రభుత్వ ZP హై స్కూల్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
ఇన్నాళ్లు ప్రభుత్వ పాఠశాలలు అంటే శిథిలావస్థకు చేరువలో ఉన్న తరగతి గదులు, కనీస సదుపాయాలైన తాగు నీరు, బాత్ రూమ్స్ కు లేని విద్యా సంస్థలుగా ఉండేవి. ఇక క్రీడల గురించి, కొత్త టెక్నాలజీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అనేలా పరిస్థితులు ఉండేవి.
కానీ ఇప్పుడా అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసారు మంగళగిరి ఎమ్మెల్యే, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. తన నియోజవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా మార్చేందుకు మంగళగిరి పరిధిలోని నిడమర్రు ప్రాంతంలో సుమారు 5 ఎకరాల సువిశాల స్థలం లో ప్రభుత్వ ZP హై స్కూల్ ని లోకేష్ తన సొంత నిధులతో నిర్మించారు.
లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ(LEAP) కార్యక్రమం కింద నిర్మాణం మొదలుపెట్టిన ఈ ప్రభుత్వ పాఠశాల ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. ఈ పాఠశాలకు సంబంధించిన యు ట్యూబ్ షొర్స్, ఇన్ స్టా రీల్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
దీనితో అసలు ఆ పాఠశాల ఎక్కడ ఉంది.? ఎలా ఉంది అనే ఆసక్తి పిల్లల తల్లితండ్రుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇదిలా ఉంటే పాఠశాల విషయానికొస్తే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, బవిషయ్త్ అవసరాలకు తగ్గట్టుగా ఆకర్షణీయమైన తరగతి గదులు, విశాలమైన ఆట స్థలాలు,
200 మీటర్ల రన్నింగ్ ట్రాక్, ఫుట్ బాట్, బాస్కెట్ బాల్, ఖో ఖో, కబడ్డి వంటి అవుట్ డోర్ కి తోడు బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్, కేరమ్స్ వంటి అవుట్ డోర్ స్పోర్ట్స్ కి సంబంధించిన సదుపాయాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇక నాణ్యమైన మౌలిక వసతులు, ఆరోగ్యకరమైన వాతావరణం, చక్కటి ప్లే గ్రౌండ్ ఇలా పాఠశాల ఆవరణం మొత్తం పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారిపోయింది.
ఇక అధునాతన సైన్ లాబ్స్, కంప్యూటర్ లాబ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ వంటి ఇంటర్ నేషనల్ స్కూల్స్ లో అందుబాటులో ఉండే వసతులు కూడా నిడమర్రు ZP హై స్కూల్ లో కనిపిస్తున్నాయి. ఒక ఇంటర్ నేషనల్ స్కూల్ స్టాండర్డ్స్ తో కనిపిస్తున్న ఈ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ కోసం ఈ ఏడాది ప్రవైట్ పాఠశాలల మాదిరి పోటీ వాతావరణం ఏర్పడింది.
ఇటువంటి మార్పు ప్రభుత్వ విద్య పట్ల ప్రజల దృష్టిని మారుస్తుంది, వారికి కొత్త ఆశలను కలిగిస్తుంది. మంగళగిరి నిడమర్రు పాఠశాల ఇప్పుడు రాష్ట్రానికే ఒక మంచి ఆదర్శంగా నిలుస్తుంది. లోకేష్ మాదిరే రాజకీయాలకు అతీతంగా ఇతర నియోజకవర్గ ఎమ్మెల్యే లు కూడా తమ తమ నియోజకవర్గంలో ఇటువంటి ప్రభుత్వ పాఠశాలలను నిర్మిస్త్తే ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ ప్రవైట్ పాఠశాలలకు మంచి పోటీని అందిస్తాయి.
ప్రభుత్వాలు ఉచితాల పేరుతో ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టె బదులుగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడులను, ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మాణం చేయడం, అధునాతన టెక్నాలజీ ని అందుబాటులో ఉంచడం రాష్ట్ర పురోగతికి, ప్రజల జీవన ప్రమాణాల పెంపుకి దోహదపడుతుందంటూ లోకేష్ ముందడుగును ప్రజలందరూ అభినందిస్తున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ హయంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు బయటపడింది. అప్పట్లో అది…
The YSR Congress ecosystem is absolutely electrified since last night. They have been carrying this…