ఫస్ట్ లుక్ : బ్లాస్ట్ అయ్యిందిగా!

Ekkadiki Potavu Chinnavada first look, nikhil, tollywood, Nikhil Siddhartha వర్ధమాన నటీనటులలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకోవడంలో యువ హీరో నిఖిల్ పూర్తిగా విజయవంతమయ్యారు. నిఖిల్ సినిమా చేస్తే… అందులో కొత్తదనం కాస్తైనా ఉంటుందని నమ్మే ప్రేక్షకుల సంఖ్యకు కొదవలేదు. ఆ క్రమంలోనే తన తాజా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసాడు నిఖిల్.

“ఎక్కడికి పోతావు చిన్నవాడా” అనే పేరుతో రూపుదిద్దుకోనున్న ఈ పోస్టర్ లో ‘యు కెన్నాట్ ఎస్కేప్ లవ్’ అంటూ థీమ్ తో ‘బ్లాస్ట్’ అయిన సీసాను హీరో నిఖిల్ ఆశ్చర్యంగా చూస్తున్న ఫోటో వీక్షకులను కట్టిపడేస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ఈ పోస్టర్ పై ‘బ్లాస్టింగ్’ స్పందన రావడంతో హీరో నిఖిల్ ఖుషీఖుషీగా ట్వీట్లు చేసుకుంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories