క్లాసికల్ డాన్స్ తో అదరగొట్టిన నీతా అంబానీ.

Nita Ambani classical dance

అంబానీ ఇంట పెళ్లి వేడుకల నేపథ్యంలో నీతా అంబానీ చేసిన క్లాసికల్ డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన కొడుకు అనంత్ అంబానీ – రాధికల ప్రీ వెడ్డింగ్ షూట్ లో భాగంగా గుజరాత్ లోని జామ్ నగర్ లో జరిగిన వేడుకలో నీతా అంబానీ తన నాట్య ప్రదర్శన చేసారు.

‘విశ్వంభర స్తుతి అనే దుర్గాదేవి’ పాటకు నీతా తన నాట్యాన్ని జోడించారు. ఒక వ్యాపారవేత్త ముఖేష్ భార్యగా..ముంబై ఐపిల్ క్రికెట్ టీం ఓనర్ గా, ఒక మహిళా వ్యాపారావేత్తగా అందరికి సుపరిచితమైన నీతా అంబానీ తన చిన్న కుమారుడి పెళ్లి వేడుకలలో తనలో ఉన్న నాట్య కళను కూడా అందరికి పరిచయం చేసారు.

ADVERTISEMENT

నీతా అంబానీ సాంప్రదాయ దుస్తులతో, హీరోహిన్ లకు పోటీగా చేసిన నృత్యంతో ఆ కార్యక్రమానికి హాజరైన అతిధులు ఒక్కసారిగా మంత్రముగ్దులను చేసారు. అనంత్ – రాధికల ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో నీతా అంబానీ డాన్స్ హై లైట్ గా నిలిచిందంటూ నీతా పై ప్రశంసలు కురిపించారు పలువురు సెలబ్రేటిస్. అలాగే తన నాట్యాన్ని తన మనవరాలు శక్తి, వేద సహా మహిళా శక్తి స్వరూపాలైన యువతకు అంకితమిచ్చారు నీతా అంబానీ.

ఈ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి వేలాదిమంది అతిధులు తరలివచ్చారు. హాలీవుడ్ నుంచి ప్రముఖ పాప్ సింగర్ రిహన్నా కూడా ఈ వేడుకలో పాల్గొని తన ప్రదర్శన ఇచ్చారు. ఇలా ప్రముఖ సెలబ్రేటిస్ ఆట పాటలతో అంబానీ ఇంట పెళ్లి సందడి షురూ అయ్యింది. అయితే ఎవ్వరు ఊహించని క్లాసికల్ డాన్స్ తో వైరల్ అయిన నీతా అంబానీ డాన్స్ వీడియోను చూసిన వారంతా క్యా బాత్ హై అంటూ నీతా అంటూ ఆమె పై ప్రసంశలు కురిపిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories