ఎన్టీఆర్ బ్రాండ్ నితిన్ చేతికి?

Nithiin Ad Shootingయంగ్ హీరో నితిన్ తన యాడ్ షూట్ కు సంబంధించిన రెండు చిత్రాలను కాసేపటి క్రితం ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అయితే అది ఏ బ్రాండ్ అనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ నితిన్ ఒక ప్రముఖ సాఫ్ట్‌డ్రింక్ బ్రాండ్, అప్పీ ఫిజ్‌కు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నట్టు నివేదికలు ఉన్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల వరకు అప్పీ ఫిజ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చేశాడు.

ADVERTISEMENT

ఈ వార్త నిజమైతే అతని ఒప్పందం ముగిసినట్లుగా ఉంది. యాడ్ షూట్‌ ఫోటోలలో హీరో హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఈ ఏడాది భీష్మతో నితిన్ పెద్ద హిట్ అందుకున్నాడు. కరోనావైరస్ పరిశ్రమను ఎక్కడిది అక్కడే ఆపేసిన తరుణంలో ఈ ఏడాది తెలుగు సినిమాలో హిట్లు చాలా తక్కువ. అందుకే భీష్మ సక్సెస్ నితిన్ కు స్పెషల్.

నితిన్ కు మూడు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత ఈ సినిమా విజయం సాధించింది. ఈ లాక్డౌన్లో నితిన్ వివాహం కూడా చేసుకున్నాడు. తన తదుపరి చిత్రం రంగ్ దేతో వివాహితుడిగా తన మొదటి హిట్ కోసం చూస్తున్నాడు. ఆ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ ఈ మధ్యనే మొదలుపెట్టారు. అప్పటికి థియేట్రికల్ వ్యాపారం సాధారణమైతే ఈ చిత్రం సంక్రాంతి 2021 కి విడుదలయ్యే అవకాశం ఉంది.

ఆ చిత్రం ఆన్ లైన్ హక్కుల కోసం జీ5 ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ డీల్ ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టాడు నితిన్. ఒకవేళ థియేటర్లలో సినిమా విడుదలకు సానుకూల పరిణామాలు ఉంటే థియేటర్ల లోనే విడుదల చెయ్యాలని అతని ఆలోచనగా ఉంది.

ADVERTISEMENT
Latest Stories