క్రిస్మస్ కూ, సంక్రాంతికి రష్ ఎక్కువ కావడంతో కొన్ని సినిమాలు కొత్త దారి వెతుకుంటున్నాయి. చాలా సినిమాలు డిసెంబర్ లో రావాలని అనుకున్నా తాజాగా ఒకటి రెండు సినిమాలకు మించి వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. డిసెంబర్ లో వద్దామనుకున్న సినిమాలు ఇప్పుడు ఫిబ్రవరిలో మంచి డేట్ల వైపు చూస్తున్నాయి.
తాజాగా నితిన్ భీష్మ సినిమా ఫిబ్రవరిలో డేట్ లాక్ చేసింది. భీష్మ ఫిబ్రవరి 21న మహాశివరాత్రి సందర్భంగా విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. వచ్చే నెలలోనే పూర్తి అయిపోయే అవకాశం ఉందట. నితిన్ గత ఏడాది నటించిన ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు నిరాశపరిచాయి.
ఆ మాటకొస్తే అ..ఆ తర్వాత నితిన్ కు సరైన సక్సెస్ లేదు. దీనితో నితిన్ భీష్మ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నితిన్ సరసన రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసకల్యాణం తరువాత బ్రేక్ తీసుకున్న నితిన్ ఇప్పుడు జోరు మీద ఉన్నాడు.
భీష్మ కాకుండా ఇప్పటికే నితిన్ మరో రెండు సినిమాలు పట్టాలెక్కించాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే… చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చదరంగం అనే సినిమాలు ఇప్పటికే లూప్ లైన్ లో ఉన్నాయి. భీష్మ ఫిబ్రవరికి వాయిదా పడటంతో ఈ మూడు సినిమాలూ 2020లోనే విడుదల కానుండడం విశేషం.





