నితిన్ వేట… ‘అత్తారింటికి దారేది’ అవుట్..!

a aa, nithin, samantha, attarintiki darenti, srimanthudu, mahesh babu, NTR, Nannaku Prematho, US Box office, US collections, telugu Movie, Trivikram  యుఎస్ బాక్సాఫీస్ వద్ద ‘అ… ఆ…’ సినిమా కలెక్షన్ల పర్వం కొనసాగుతోంది. ఒక మంచి సినిమాను ఇస్తే ప్రేక్షకులు ఏ విధంగా పట్టం కడతారో ‘అ… ఆ…’ సినిమా ద్వారా మరోసారి నిరూపిస్తున్నారు. సహజంగానే త్రివిక్రమ్ సినిమాలకు దాసోహం అనే ఓవర్సీస్ ప్రేక్షకులు ‘అ…ఆ…’ డైలాగ్స్ కు కూడా ఫిదా అవుతున్నారు. ఆహ్లాదకరమైన సినిమాగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ను పంచుతున్న ఈ సినిమా యుఎస్ బాక్సాఫీస్ వద్ద గత రికార్డులను తిరగరాస్తోంది.

మొదటి 8 రోజుల కలెక్షన్స్ తో ‘అత్తారింటికి దారేది’ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ నెలకొల్పిన రికార్డులను అధిగమించాడు నితిన్. అయితే ఈ రెండు సినిమాలు కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలోవే కావడం విశేషం. ఇదిలా ఉంటే, ఈ ఏడాది సంక్రాంతికి 2 మిలియన్ కలెక్షన్స్ ను సాధించిన జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘నాన్నకు ప్రేమతో’ను అందుకోవడానికి కూడా కొద్ది దూరంలోనే ఉన్నాడు నితిన్. బహుశా ఈ వీకెండ్ లో “నాన్నకు ప్రేమతో” రికార్డు కూడా అవుట్ కావచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ADVERTISEMENT

అదే జరిగితే మొదటి స్థానంలో ప్రభాస్ ‘బాహుబలి’ నిశ్చింతగా ఉండగా, రెండవ స్థానంలో ఉన్న మహేష్ ‘శ్రీమంతుడు’ దగ్గరికి కూడా వస్తారేమో అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. దాదాపు 2.87 మిలియన్ డాలర్స్ తో ఉన్న ‘శ్రీమంతుడు’ దగ్గరికి ‘అ…ఆ…’ వస్తే అది అపూర్వమైన విజయంగానే భావించాలి. ఈ రికార్డులకు క్రెడిట్ త్రివిక్రమ్ కే వెళ్ళినా, సినిమా హీరోగా నితిన్ కు కూడా ప్రధాన భాగమే రానుంది.

ADVERTISEMENT
Latest Stories