
అయితే ఈ నలుగురి దర్శకత్వంలో ఒక్క అగ్ర హీరో కూడా నటించలేదు. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లు త్రివిక్రమ్ ను మిస్ కాగా, మహేష్, పవన్ లు రాజమౌళి, వినాయక్ లను మిస్సయ్యారు. అయితే ఈ నలుగురి దర్శకత్వంలో నటించిన ఏకైక హీరో ఒకరున్నారు. అతనే… ప్రస్తుతం ‘అ…ఆ…’ ద్వారా వెండితెరపై సందడి చేస్తున్న నితిన్. అగ్ర హీరోలకు కూడా సాధ్యం కాని విషయాన్ని నితిన్ చేసి చూపించాడు.
కెరీర్ తొలినాళ్ళల్లోనే వినాయక్ దర్శకత్వంలో ‘దిల్’ సినిమా చేసి బంపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత రాజమౌళి ‘సై’ చిత్రంతోనూ ఓ మోస్తరు విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అలాగే పూరీ జగన్నాధ్ ‘హార్ట్ ఎటాక్’ కూడా జక్కన్న సినిమా బాటలోనే పయనించింది. ఇక, ప్రస్తుతం సందడి చేస్తున్న త్రివిక్రమ్ సినిమా ‘అ… ఆ…’ నితిన్ కెరీర్ లోనే భారీ విజయంగా నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.
అయితే ఈ అగ్ర దర్శకుల సినిమాలు నితిన్ వశం కావడానికి కారణం… ప్రధానంగా నితిన్ తండ్రి ఒక నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కావడమే అన్న టాక్ సినీ వర్గాల్లో వినపడుతోంది. దీనికి తోడు సహజంగానే సినీ జనాలు కూడా భావించే “లక్” అదేనండి…. కాస్తంత అదృష్టం కూడా నితిన్ తోడయ్యింది. ఏది ఏమైనా రికార్డు రికార్డే కదా..!
Srijita Ghosh turns a rain-kissed glass setting into a striking fashion frame, pairing delicate white…
Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam has officially moved from October 2 to October 9. The…