రామ్ గోపాల్ వర్మ పబ్లిసిటీ స్టంట్లకు బుట్టలో పడని బయర్లు

Ram Gopal Varma Continues To Target Nara Lokeshరామ్ గోపాల్ వర్మ తాజా వివాదస్పద చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ థియేట్రికల్ ట్రైలర్ వైరల్ అయ్యింది. ఇప్పటికే ఎన్నికల ఓటమితో ఇబ్బంది పడుతున్న టీడీపీని మరింతగా టార్గెట్ చేశాడు రాము. అయితే రాము ఎన్ని పబ్లిసిటీ స్టంట్లు చేసినా బయర్లు మాత్రం సినిమా కొనడానికి ముందుకు రావడం లేదట.

ADVERTISEMENT

ఈ మధ్య రాము సినిమాల ట్రైలర్లు వైరల్ అవుతున్న థియేటర్లలో వాటిని చూడటానికి మాత్రం ప్రేక్షకులు ముందుకు రావడం లేదు. పై పెచ్చు గతంలో టీడీపీ మీద తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలను కోర్టు అడ్డుకుంది. ఈ తలపోట్లు అన్నీ ఎందుకు అని బయర్లు సినిమాలు దూరంగా ఉంటున్నారు.

ముందు నవంబర్ 28న విడుదల చెయ్యాలని రాము అనుకున్నా బయర్లు ముందుకు రాకపోవడంతో విడుదల తేదీని అధికారికంగా ప్రకటించడం లేదు. ఇది ఇలా ఉండగా మరింత వివాదాలు రేపి సినిమాని మార్కెట్ చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నాడు రాము. నారా లోకేష్ ని టార్గెట్ చేస్తూ పప్పు లాంటి అబ్బాయి అనే పాటని ఎల్లుండి విడుదల చెయ్యబోతున్నట్టు ప్రకటించాడు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం ఇప్పటికే కొన్ని చోట్ల రాజకీయ హత్యలు జరగడం మనం చూశాం. ఇటువంటి సినిమాలు ఈ తరుణంలో మరింత ప్రమాదకరం [పలువురు అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటువంటి సినిమాల వల్ల తమకు రాజకీయ మైలేజ్ వస్తుందని అనుకోకుండా సంఘంలో కులఘర్షణలకు ఆస్కారమిచ్చే ఇటువంటి సినిమాలు రాకుండా చూస్తే ఆయనకే మంచిదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories