
‘శ్రీమంతుడు’ సక్సెస్ తర్వాత మహేష్ బాబు ఏకంగా ఆడి కారును బహుమతిగా ఇచ్చి, తన సంతోషం ఏ పాటిదో చెప్పకనే చెప్పాడు. ఊహించని ఈ పరిణామంతో కొరటాల శివ ఎంత ఆనందానికి గురయ్యారో ఆ సమయంలో చెప్పకనే చెప్పారు. మహేష్ కెరీర్ కు ఖచ్చితంగా ఓ బ్లాక్ బస్టర్ కావాల్సిన సమయంలో, ‘శ్రీమంతుడు’ ద్వారా ఆ ముచ్చట తీర్చడంతో కొరటాలకు కారు బహుమతిగా అందించాడు ప్రిన్స్.
మహేష్ కు ‘శ్రీమంతుడు’ విజయం ఎంత అవసరమో, జూనియర్ ఎన్టీఆర్ కు ‘జనతా గ్యారేజ్’ సక్సెస్ ‘అంతకు మించి’ అని చెప్పవచ్చు. ఒక రకంగా జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ కు ‘జనతా గ్యారేజ్’ సినిమా ఓ వారధి లాంటిది. సినిమా సక్సెస్ అయితే ఒక వైపు, లేదంటే మరో వైపు తారక్ నిల్చునే పరిస్థితి ఉండడంతో… ఈ సినిమాపై అన్ని వర్గాలు ఆసక్తిని ప్రదర్శించాయి. అయితే జూనియర్ ఆశించిన విధంగా బాక్సాఫీస్ వద్ద సినిమా కాసులు కురిపించింది.
ఈ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయిన జూనియర్, కొరటాలకు ఏదొక బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. అయితే ఇప్పటికే మహేష్ కారు ఇచ్చేయడంతో, కొరటాలకు ఒక స్థిర నివాసాన్ని ఏర్పాటు చేయాలని జూనియర్ కంకణం కట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక డూప్లెక్స్ ఇంటిని కొరటాలకు బహుమతిగా ఇవ్వాలని జూనియర్ నిర్ణయించుకున్నట్లుగా చక్కర్లు కొడుతున్న వార్తల్లో నిజమెంతో తెలియాలంటే… మరికొద్ది కాలం వేచిచూడక తప్పదు.
ఒకవేళ ఇదే జరిగితే… కొరటాల శివ తన జీవితంలో కొనుగోలు చేయాల్సిన వస్తువులు ఉండకపోవచ్చు. ఇలా ప్రతి సినిమా సక్సెస్ అయ్యే విధంగా చూసుకుంటే… స్వామి కార్యం, సకార్యం జరిగినట్లు… అటు సక్సెస్, పేరు ప్రతిష్టలతో పాటు, ఇటు బహుమతుల పేరుతో జీవితానికి సరిపడిన వస్తువులు కూడా సమకూరినట్లు అవుతుంది. ఒకసారి హీరో ఇస్తే… మరోసారి నిర్మాతలు ఇవ్వవచ్చు. ఏది ఏమైనా ఆపదలో ఉన్న హీరోలకు ‘ఆపద్భాందవుడు’గా అవతరించాడు కొరటాల.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…