జూనియర్ ఎన్టీఆర్ దేవర ఏపీ, తెలంగాణ రైట్స్ కోసం దిల్ రాజు, మైత్రి పోటీ పడుతున్నాయి అని సమాచారం. ఈ మధ్య కాలంలో మైత్రి దిల్ రాజు తో పోటీ పడి సలార్ రైట్స్ దక్కించుకుంది. దిల్ రాజుకు పోటీగా సంక్రాంతికి హనుమాన్ రిలీజ్ చేసి విన్నర్ గా నిలిచింది.
దీనితో ఇప్పుడు దేవర రైట్స్ ప్రెస్టేజ్ ఇష్యూ గా మారాయి.
అయితే దేవర ప్రొడ్యూసర్లు మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే దేవర రైట్స్ దిల్ రాజు కే ఎందుకు ఇవ్వాలి అని చెప్పినట్టుగా ఒక ఫీలర్ మార్కెట్ లో వదిలారు ఆయన.
ఫ్యామిలీ స్టార్ సినిమా ను మార్చి 28 కి ప్లాన్ చేస్తున్నాం ఒక వేళ దేవర ఏప్రిల్ 5 నుండి వాయిదా పడితే ఆ డేట్ కి మేము వస్తాం.
ఇది చూడటానికి చాలా మాములు అప్డేట్ లానే కనిపిస్తుంది. అయితే ఇందులో దేవర ప్రొడ్యూసర్లకు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది.
ఫ్యామిలీ స్టార్ మార్చి 28న వస్తుంది. ఒకవేళ దేవర ఏప్రిల్ 5న వస్తే… ఫ్యామిలీ స్టార్ ఒక వారం ముందు రాబోతున్నట్టు. దిల్ రాజు తన పరపతిని వాడి ఫ్యామిలీ స్టార్ కి రికార్డు థియేటర్స్ బ్లాక్ చేసుకుంటారు అనే దాంట్లో అనుమానం లేదు.
మరి రెండో వారంలో కూడా చాలా థియేటర్స్ హోల్డ్ చేస్తారు కదా? అంటే దిల్ రాజు కాకుండా వేరే ఎవరికైనా దేవర రైట్స్ ఇస్తే వారికి దేవరకు రికార్డు రిలీజ్ ఇవ్వడం కష్టం అవుతుంది.
ఎక్సిబిటర్లు ఎన్టీఆర్ సినిమా అని టెంప్ట్ అవ్వడం ఖాయం అయితే చాలా మంది దిల్ రాజు తో పెట్టుకునే ధైర్యం చెయ్యరు.
ఒకవేళ దేవర రైట్స్ దిల్ రాజు కే ఇస్తే…. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ దేవరకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకుంటారు.
ఒకవేళ మైత్రి కి దేవర రైట్స్ వెళ్తే…. దిల్ రాజు తో పోరాటం తప్పదు. దేవర రైట్స్ మీద ఆ సినిమా నిర్మాతలు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఈ లీక్ ని పరిగణలోకి తీసుకోవాలి మరి.




