
అక్కడున్న ఇద్దరు హీరోల అభిమానులు టికెట్ల కొనుగోలు విషయంలో పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమాని ఒకరు డల్లాస్ నగరంలోని గ్యాలక్సీ థియేటర్‌లో ఏకంగా 75 టికెట్లు కొనుగోలు చేశాడు. పైగా ఆ టికెట్లన్నంటినీ ఒక చోట చేర్చి ఒక ఫోటో తీసి.. ఆ ఫోటోను ట్వీట్టర్‌లో పోస్ట్ చేశాడు. అయితే, ఆ ట్వీట్ నెట్టింట బాగా వైరల్ అయ్యింది. ఎన్టీఆర్ అభిమానులు కావాలనే ఆ ట్వీట్ ను షేర్ అండ్ లైక్స్ తో సోషల్ మీడియాలో హోరెత్తించారు.
తెలియకుండానే చరణ్ అభిమానులను రెచ్చగొట్టారు. ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగారు. ఇప్పటి నుంచే భారీ బ్యానర్లకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సినిమా రిలీజ్ కి ముందే హీరోల ఫ్యాన్స్ పోటీ పడుతుంటే.. ఇక రేపు సినిమా రిలీజ్ అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో ?. మరోపక్క ఇప్పటికే ఫిల్మ్ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధు లాంటి వాళ్ళు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని ముక్తకంఠంతో చెప్పిన సంగతి తెలిసిందే.
మెయిన్ గా ఎన్టీఆర్ సీన్స్ అన్నీ అద్భుతంగా వచ్చేలా రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడని కామెంట్స్ బలంగా వినిపించాయి. మరి నిజంగానే దర్శక ధీరుడు ఎన్టీఆర్ ను హైలైట్ చేయడానికి కాస్త శ్రద్ధ చూపించినా.. ఫ్యాన్స్ మధ్య రచ్చ హీరోలను కూడా టచ్ చేయొచ్చు. ఎలాగూ ఈ సినిమా ట్రైలర్ లో ఎన్టీఆర్ ను ఎక్కువ హైలైట్ చేసారని చరణ్ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు కూడా.
దీనికితోడు సోషల్ మీడియాలో కూడా ఆర్ఆర్ఆర్ అంటే.. ఎన్టీఆరే మెయిన్ అన్నట్టుగా తారక్ ఫ్యాన్స్ హడావుడి ఎక్కువైపోయింది. అందుకే.. చరణ్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఏ స్థాయిలో తమ హీరోని హైలైట్ చేయాలా అని ఫ్యాన్ పేజీ గ్రూప్స్ ముమ్మరంగా చర్చలు మొదలుపెట్టారు. మొత్తమ్మీద ‘ఎన్టీఆర్ ఫ్యాన్’ టికెట్ల రచ్చ ‘చరణ్ ఫ్యాన్స్’ ను టచ్ చేసింది !
Nitesh Tiwari’s Ramayana is scheduled to arrive in theatres in Diwali 2026. With a few…
గత ఐదేళ్లు ఎన్నికలకు సిద్ధమా.? సిద్ధమా అంటూ ప్రత్యర్థి పార్టీల నేతల మీద గొంతులు చించుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు…