Telugu

‘జనతా’ దెబ్బకు లైన్ లో ఉన్న ‘పవన్’ మూవీ!

‘జనతా గ్యారేజ్’ ముందు వరకు ఎన్టీఆర్ కెరీర్ లో 50 కోట్ల క్లబ్ లో ఒకే ఒక్క సినిమా ఉంది. అది కూడా సుకుమార్ దర్శకత్వం వహించిన “నాన్నకు ప్రేమతో” ఈ ఏడాది సంక్రాంతి విడుదలై, సరిగ్గా 50 కోట్లకు చేరువైంది. దీంతో ‘జనతా గ్యారేజ్’పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, హిట్ అయినా ఓ 50, 60 కోట్ల రేంజ్ కు చేరుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేసారు. కానీ, జరిగింది ఏమిటి… తొలి రోజు హిట్ టాక్ రాలేదు, అయినా రెండు వారాలు ముగిసే సమయానికి టాప్ 5లో చోటు దక్కించుకోవడం విశేషం.

ఇప్పటికే పలు మెగా హీరోల రికార్డులను బద్దలు కొట్టిన ‘జనతా గ్యారేజ్,’ తాజాగా పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాను ఈ వీకెండ్ లో దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 70 కోట్ల క్లబ్ లో చేరిన ‘జనతా గ్యారేజ్’ పవన్ సినిమాను దాటగలిగితే, ఏకంగా టాప్ 3లో చోటు దక్కించుకుంటుంది. ‘బాహుబలి, శ్రీమంతుడు’ తర్వాత స్థానాలలో ‘జనతా గ్యారేజ్’ నిలవడం పక్కా అని ట్రేడ్ వర్గాలు కూడా బల్లగుద్ది చెప్తున్నాయి. వినాయకచవితి సెలవులతో కదం తొక్కిన జనతాకు, బక్రీద్ సందర్భంగా కూడా ప్రేక్షకులు పోటెత్తారు. అలాగే సాధారణ రోజులలో కూడా కలెక్షన్స్ దారుణ స్థితిలో లేకపోవడం… జూనియర్ అభిమానులకు పండగ లాంటి వార్త.

ADVERTISEMENT

అయితే ఇదే ఊపులో ‘శ్రీమంతుడు’ సినిమాను అందుకునే సత్తా ‘జనతా గ్యారేజ్’కు ఉందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ‘బాహుబలి’ తర్వాత స్థానంలో మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ ఉన్న విషయం తెలిసిందే. 80 కోట్ల క్లబ్ లో ఉన్న ‘శ్రీమంతుడు’ను అందుకుంటే… మళ్ళీ తారక్ కు పునర్వైభవం వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దక్కిన హిట్ కే మిక్కిలి సంతోషంగా ఉన్న చిత్ర బృందానికి ఆల్ టైం జాబితాలో 2వ స్థానానికి చేరితే, ఇక ఆనందానికి హద్దులు ఉంటాయా? అయితే 2 దక్కినా, లేకున్నా, ఖచ్చితంగా 3లో నిలవడం అయితే ఖాయం అంటున్నారు ట్రేడ్ వర్గాలు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Mirzapur & Awarapan 2: Big Warning to Akshay and Ajay?

The box office results have become very unpredictable. Amid this, the situation of every big…

10 minutes ago

Allu Arjun-Prabhas Title War: Forbes Quietly Took U-Turn?

Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…

9 hours ago