
ఎన్టీఆర్ కుమారుడు మోహనకృష్ణ, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు నిన్న సిఎం రేవంత్ రెడ్డిని కలిసి అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో స్థలం కేటాయించిన్నట్లయితే, ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తామని, ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. సిఎం సానుకూలంగా స్పందించారని మోహనకృష్ణ చెప్పారు.
హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తే ఆయన అభిమానులకు, ఏపీ ప్రజలకు చాలా సంతోషమే. కానీ తెలంగాణ సమాజం ఆమోదిస్తుందా?అనేది చాలా ముఖ్యం.
ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా రెండు విషయాలు సుస్పష్టం. 1. గత 20 ఏళ్ళలో తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ చాలా బలపడింది. 2. తెలంగాణ ఎన్నికలను ఆంధ్రా ఓటర్లు ప్రభావితం చేయగలరు.
తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నప్పుడు తెలంగాణ సమాజం ఆమోదం లేకుండా హైదరాబాద్ నడిబొడ్డున వంద అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో తప్పకుండా వ్యతిరేకత మరింత పెరుగుతుంది.
తెలంగాణ తల్లి విగ్రహం విషయంలోనే రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని తెలంగాణ సమాజం ఆమోదించిందో లేదో ఇంకా తెలీదు. అటువంటప్పుడు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తే తెలంగాణ సమాజం ఆమోదిస్తుందా? ఆమోదించకపోతే నష్టపోయేది ఎవరు?అంటే కాంగ్రెస్ పార్టీయే కదా?
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ పార్టీ కూడా ఖమ్మంలో శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసింది. అది ఖమ్మం, భద్రాచలం, హైదరాబాద్, వరంగల్ జిల్లాలలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికే అని అందరికీ తెలుసు.
అప్పుడు కూడా విగ్రహం ఏర్పాటు పట్ల కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ, కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు చాలా శక్తివంతంగా ఉంది కనుక అభ్యంతరాలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంత శక్తివంతంగా లేదు.
రేవంత్ రెడ్డిని అడ్డుపెట్టుకొని ఆంధ్రా నాయకులు మళ్ళీ తెలంగాణ మీద పెత్తనం చేస్తున్నారని బిఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఆరోపిస్తూనే ఉన్నారు. వారి ఆరోపణలు తెలంగాణ సమాజాన్ని తప్పక ఆలోచింపజేస్తుంది కూడా.
అయితే ఎన్టీఆర్ విగ్రహాన్ని బిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తే గ్రేటర్ ఎన్నికలలో హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా ఓటర్లు దానికి దూరం అవుతారనే ధీమా, ఆలోచన రేవంత్ రెడ్డికి ఉండి ఉండవచ్చు. కానీ కేవలం గ్రేటర్ లెక్కలు మాత్రమే చూసుకొని అడుగు ముందుకు వేస్తే భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది.
కనుక అవుటర్ రింగ్ రోడ్ వద్ద కంటే సినీ పరిశ్రమకు చిరునామాగా ఉన్న ఫిలిమ్ నగర్‌లో ఎన్టీఆర్ విగ్రహం.. శ్రీకృష్ణుడు లేదా శ్రీరాముడు లేదా మరో సినీ రూపంలో ఏర్పాటు చేయిస్తే తెలంగాణ సమాజం కూడా ఆమోదించవచ్చు.
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…