
ఇటీవల తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఓ మహిళా ఐఏఎస్ అధికారిణి గురించి ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్‌టీవీ అనుచితమైన కధనం ప్రసారం చేసింది.
ఆయన పిర్యాదు మేరకు హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటయింది. ఈ వ్యవహారం ముదురుతోందని గ్రహించిన ఎన్‌టీవీ యాజమాన్యం మంగళవారం క్షమాపణలు చెప్పింది. అంటే ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు కధనం ప్రసారం చేశామని అంగీకరించినట్లే అయ్యింది.
క్షమాపణలు చెప్పేశాము కనుక ఇక్కడితో ఈ వివాదం ముగుస్తుందని ఎన్‌టీవీ యాజమాన్యం ఆశించింది. కానీ సిట్ బృందం ఆ న్యూస్ ఛానల్ వెనుక రాజకీయ శక్తులు ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టింది. ఎన్‌టీవీ న్యూస్ ఛానల్ ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేష్ బ్యాంకాక్ పారిపోతుండగా శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. ఎన్‌టీవీ న్యూస్ ఛానల్ రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్‌లను కూడా పోలీసులు నిన్న రాత్రి అరెస్ట్ చేశారు.
వెంటనే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీష్ రావు జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని ఖండించారు. వేరే సందర్భాలలో ఖండిస్తే ఎవరూ ఆయనని తప్పు పట్టేవారు కారు. కానీ ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ ప్రమేయం ఉండి ఉండవచ్చని ప్రభుత్వం, పోలీసులు అనుమానిస్తున్నప్పుడు హరీష్ రావు కలుగజేసుకోవడంతో వారి అనుమానాలను బలం చేకూర్చినట్లయింది.
హరీష్ రావు కుట్రలు కుతంత్రాలు చేస్తుంటారని వాటికే తాను బలైపోయానని కల్వకుంట్ల కవిత తరచూ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కనుక ఈ కేసులో అరెస్ట్ అయిన ఎన్‌టీవీ రిపోర్టర్లు ఈ కధనం వెనుక హరీష్ రావు లేదా బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందని చెప్పినట్లయితే, ఆ పార్టీ పునాదులు కదిలిపోయే ప్రమాదం పొంచి ఉంది.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…