అబ్సెషన్: సెన్సార్ కట్స్ తో కథ మారిపోయింది

Poster or still from Obsession highlighting the controversy surrounding censored scenes in the Indian release version.

అబ్సెషన్ అనే ఆంగ్ల చిత్రం ప్రపంచవ్యాప్తంగా సృష్టిస్తున్న హంగామా చూస్తూనే ఉన్నాం. అయితే.. ప్రపంచం మొత్తం చూసిన సినిమా వేరు, ఇండియా చూసిన సినిమా వేరు అనేది ఇప్పుడిప్పుడు జనాలకి అర్థమవుతుంది. “అబ్సెషన్” సినిమాలో మితిమీరిన హింస మరియు శృంగార సన్నివేశాల్ని ఇండియన్ సెన్సార్ బోర్డ్ కట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే.. ఆ కట్ చేసిన సీన్స్ ఏకంగా సినిమా చూసిన విధానాన్నే మార్చేశాయి. ఎందుకంటే.. “అబ్సెషన్” సినిమాలో చాలా కీలకమైన ఒక రేప్ సీన్ ని సెన్సార్ బోర్డ్ కట్ చేసింది. ఆ సీన్ లోనే హీరోయిన్ పాత్ర పడే యాతన మరియు హీరో ఎంత క్రూరంగా బిహేవ్ చేశాడు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ సీన్ చూసి ఎండింగ్ చూస్తే.. హీరోయిన్ చేసింది కరెక్టే కదా అనిపిస్తుంది. ఆ సీన్ కట్ చేయడంతో ఇప్పుడు ఇండియాలో రిలీజైన వెర్షన్ చూసిన విధానమే మారిపోయింది.

ADVERTISEMENT

దాంతో.. మొన్నటివరకు సీన్స్ కట్ చేసినందుకు సెన్సార్ బోర్డ్ ని తిట్టుకున్న యువత, ఇప్పుడు ఏకంగా సినిమా నేరేటివ్ ని మార్చేసినందుకు బూతులు తిడుతున్నారు. ఈ సెన్సార్ కట్ డిజిటల్ వెర్షన్ కి కూడా అప్లై అవుతుంది కాబట్టి, అమెరికాలో ఆన్ లైన్ లో ఒరిజినల్ కట్ ఎప్పుడు రిలీజై పైరసీ వెర్షన్ వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు సిన్సియర్ మూవీ గోయర్స్.

అప్పట్లో.. “గీతాంజలి” సినిమాకి గుంటూరు డిస్ట్రిబ్యూటర్ కొన్ని కీలకమైన సన్నివేశాలు కట్ చేసేశాడట, ఆడియన్స్ కి బోర్ కొడుతుందని. ఆ విషయం మేకర్స్ కి నెల రోజుల తర్వాత తెలిసింది. ఇప్పుడు అబ్సెషన్ సినిమాకి ఇలా జరగడం అనేది కంపేర్ చేయకూడనిది అయినప్పటికీ.. ఇలా జరగడం అనేది గమనార్హం.

ADVERTISEMENT
Latest Stories