టీజర్ టాక్ – మనసుతో చూడాలి!

oka manasu teaser talkకొన్ని సినిమాలను కళ్ళతో చూడాలి… మరికొన్నింటిని కళతో చూడాలి… ఇంకొన్నింటిని మనసుతో చూడాలి… అలా మనసుతో చూసే సినిమానే “ఒక మనసు” అన్న సంకేతాలను ఫస్ట్ లుక్ లోనే ఇచ్చేసింది. ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ సినిమా దర్శకుడు రామరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా మెగా తనయురాలు నిహారిక వెండితెరకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.

నాగశౌర్య, నిహారిక జంటగా నటించిన ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నాగశౌర్య సింపుల్ లుక్, నిహారిక హోమ్లీ లుక్ రామరాజు దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుండగా, సునీల్ కశ్యప్ అందించిన ఆహ్లాదకరమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తదితర అంశాలు ఈ సినిమాను మనసుతో చూడాలన్న సంకేతాలు ఇస్తున్నాయి. మధుర శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా మంచి ఫీల్ ఉన్న చిత్రంగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories