నందమూరి నటసింహం బాలకృష్ణ మరోసారి తన మార్క్ ప్రసంగంతో అందరినీ నవ్వించారు. శ్రీశారద పీఠాన్ని సందర్శించిన బాలకృష్ణ కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… అందరికీ శుభం జరిగేందుకు సంకల్పించిన ఈ పూజలో తానూ భాగస్వామి కావడం సంతోషకరంగా ఉందని, ఈ సందర్భంగా ఓ మంత్రాన్ని పటించారు.
బహుశా బాలకృష్ణకు మాత్రమే సాధ్యం అనే విధంగా చెప్పిన ఈ శ్లోకానికి అందరూ మంత్రముగ్ధులయ్యారు. అయితే అక్కడున్న అభిమాని ఒకరు “వన్స్ మోర్” అంటూ కేకలు వేయడంతో “ఏయ్… ఇది ఏమైనా సినిమా డైలాగా వన్స్ మోర్ అంటా…” అని తనదైన శైలిలో స్పందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. చూసిన వారంతా… బాలయ్య బాబా… మజాకా..! అంటున్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT



