ఒక్క అమరావతితో ఇన్ని ప్రయోజనాలా..

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణ పనులు మొదలుపెడుతుండతంతోనే దేశవిదేశాలలోని పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలకు ఓ బలమైన సానుకూల సందేశం పంపించినట్లయింది. అందువల్లే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మళ్ళీ చాలా మంది ముందుకు వస్తున్నారు.

రాజధాని అమరావతి నిర్మాణ పనులు కొనసాగుతున్న కొద్దీ రాష్ట్రానికి మరిన్ని భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వీటన్నిటి వలన జరిగే ఆర్ధిక, పారిశ్రామిక, వాణిజ్య, మౌలిక వసతుల అభివృద్ధి ఒక ఎత్తు అయితే, ఒక్క అమరావతి నిర్మాణ పనుల ద్వారానే సుమారు 30-40,000 మందికి రాబోయే 3-4 ఏళ్ళపాటు ఉపాధి లభిస్తుంది. వారిలో ఇంజనీర్లు మొదలు భవన నిర్మాణ కార్మికుల వరకు అందరికీ ఉపాధి లభిస్తుంది.

ఇంతకాలం ఉపాధి కోసం వలసలు పోతున్నవారందరికీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కూడా అమరావతిలోనే చేతినిండా పని దొరుకుతుంది.

అమరావతిలో ఇన్ని వేలమంది పనిచేస్తుంటే వారికి భారీగా నిత్యావసర సరుకులు అవసరం. అలాగే బట్టలు, గృహోపకరణాలు, పనిముట్లు వంటివి అనేకం అవసరం ఉంటాయి. రవాణా, వైద్యం, వినోదం వంటివి కూడా అవసరం ఉంటుంది. కనుక అమరావతి వల్లనే విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలలో రైతులకు, పాడి రైతులకు, వ్యాపారులు, హోటల్స్, రవాణా తదితర రంగాలలో ఉన్నవారికి భారీగా వ్యాపార అవకాశాలు లభించబోతున్నాయి.

అమరావతి నిర్మాణ దశలోనే ఇంతమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి కల్పించబోతుంటే, రాష్ట్రం నలుమూలల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగంలో నిర్మిస్తున్న రూ.8-12 లక్షల కోట్ల విలువగల పరిశ్రమలు, పోలవరం, రైల్, రోడ్‌, సీపోర్టు, ఎయిర్ పోర్ట్, మెట్రో ప్రాజెక్టులు వివిద దశలలో ఉన్నాయి.

వీటన్నిటి వలన లక్షలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి లభించబోతోంది. కనుక దేశంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అతిభారీగా ఉద్యోగాలు, ఉపాధి కల్పించబోతున్న రాష్ట్రాలలో ఒకటిగా నిలువబోతోంది. కనుక అమరావతి నిర్మాణం ఓ అరుదైన అద్భుతమే.. రాష్ట్రానికి, ప్రజలకు వరమే!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

So Many Rejections, Nani Must Be Cautious!

Nani's latest film The Paradise marked one of the most ambitious attempts of his career.…

28 minutes ago

Ranabaali Under Pressure: Is Vijay Betting Too Much on the Trailer?

Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…

57 minutes ago