‘వైసీపీ’ జంపింగ్ జిలానీ జాబితాలో లేటెస్ట్ “ట్విస్ట్”

VARUPULA-SUBBARAO in tdpజగన్ పార్టీకి చెందిన జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీలో చేరుతారన్న వార్తలు ఇటీవల హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే జ్యోతుల నెహ్రూ ప్రకటనకు ముందు ఆయన అనుచరుడు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వైసీపీని వీడుతున్నట్టు వెల్లడించారు. తన నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకునేందుకే తన కార్యకర్తలతో చర్చించి తెలుగుదేశంలో చేరుతున్నట్టు సుబ్బారావు ప్రకటించారు. చంద్రబాబు చేపట్టిన అభివృద్ధి పనులకు తన వంతు సహకారాన్ని అందిస్తానని అన్నారు.

అయితే తర్వాత ‘ట్విస్ట్’ జ్యోతుల నెహ్రూ నుండి వచ్చింది. పార్టీ మారతారని వస్తున్న వార్తలపై జ్యోతుల నెహ్రూ స్పందిస్తూ… “ప్రస్తుతానికి తాను పార్టీని మారబోవడం లేదని” ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశంలో చేరే విషయమై తాను ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదని మీడియా ముందు జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. అయితే జ్యోతుల నెహ్రూ ఇచ్చిన ఈ ‘ట్విస్ట్’ వెనుక ఉదయం నుండి చెవిరెడ్డి భాస్కరరెడ్డి జరిపిన చర్చలు సఫలీకృతం అయ్యాయన్న టాక్ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories