Telugu

జమిలిపై చర్చించడానికి భయమెందుకు?

మోడీ ప్రభుత్వం గత పదేళ్ళలో పెద్దనోట్ల రద్దు, లాక్ డౌన్, ట్రిపుల్ తలాక్ రద్దు, జమ్ము కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, జమ్ము కశ్మీర్‌ రాష్ట్ర విభజన, అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటి అసాధ్యమనుకున్న అనేక నిర్ణయాలు తీసుకొని అమలుచేసి చూపింది. కొన్ని నిర్ణయాలకు సత్ఫలితాలు రాగా మరికొన్నిటికి వ్యతిరేక ఫలితాలు, వాటితో పాటు విమర్శలు కూడా వచ్చాయి.

ఇప్పుడు మోడీ ప్రభుత్వం ‘జమిలి ఎన్నికల’ నిర్వహణ కోసం నేడు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింది. ఇది కూడా పైన పేర్కొన్నవాటిలాగే చాలా అసాధారణమైనదే. దీనిని కూడా మోడీ ప్రభుత్వం అదే విదంగా అమలుచేయడం ఖాయమనే భావించవచ్చు.

ADVERTISEMENT

నేడు ఈ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఒక బిల్లు, ఈ బిల్లు అమలుకి 129వ రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపపెట్టింది.

ఊహించిన్నట్లుగానే కాంగ్రెస్‌ మిత్ర పక్షాలు దీనిని వ్యతిరేకించగా, ఎన్డీఏలోని టీడీపీతో సహా అన్ని పార్టీలు మద్దతు పలికాయి. కనుక లోక్‌సభ ఆమోదంతో ఈ బిల్లుని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు తీసుకు వెళ్ళబోతోంది.

ఇటువంటి కీలకమైన లేదా వివాదాస్పదమైన బిల్లుని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు, కాంగ్రెస్‌ మిత్ర పక్షాలు మోడీ చేసిన ప్రతీ నిర్ణయాన్ని గుడ్డిగా వ్యతిరేకించాలన్నట్లుగానే వ్యవహరించాయి తప్ప ఈ బిల్లు దేశానికి మంచిదా కాదా? అవసరమా కాదా?దీని సాధ్యాసాధ్యాలు, లోటుపాట్లు, మార్పులు చేర్పులపై పార్లమెంటులో లోతుగా చర్చించడానికి ఇష్టపడలేదు.

ఒకవేళ అలా చర్చించి ఉండి ఉంటే జమిలి ఎన్నికలపై దేశప్రజలకు మరింత స్పష్టత వచ్చేది. ఒకవేళ ఈ ప్రతిపాదన మంచిది కాదనుకుంటే ప్పుడు ప్రజలే దీనిని బలవంతంగా అమలుచేయాలని ప్రయత్నిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని తిరస్కరించేవారు కదా?

అయినా పదేళ్ళ తర్వాత జమిలి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు, కాంగ్రెస్‌ మిత్ర పక్షాలు ఇంత ఆందోళన చెందాల్సిన అవసరం ఏమిటి?అంటే మరో పదేళ్ళ వరకు ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాగలమనే నమ్మకం కాంగ్రెస్ పార్టీకి లేదనుకోవాలేమో? లేకుంటే ఈ బిల్లు గురించి ఇంత ఆందోళన దేనికి?

యూపీయే హయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు, దానిపై జరిగిన చర్చలో బీజేపితో సహా అన్ని పార్టీలు పాల్గొని తమ అభిప్రాయాలు చెప్పాయి. ఆ చర్చల తర్వాత కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన విభజన బిల్లుకి బీజేపి కూడా మద్దతు ఇచ్చింది.

కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై కనీసం చర్చించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇష్టపడటం లేదు. ఏపీలో జగన్‌ ఏవిదంగా గుడ్డిగా చంద్రబాబు నాయుడుని వ్యతిరేకిస్తుంటారో, అదేవిదంగా కాంగ్రెస్ పార్టీ కూడా గుడ్డిగా మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తోంది తప్ప ప్రజలకు ప్రతినిధిగా పార్లమెంటులో బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదనిపిస్తుంది.

పైగా కాంగ్రెస్‌ మిత్రపక్షాలు బిల్లుకి మద్దతు ఇవ్వకపోయినా దీనిని మోడీ ప్రభుత్వం ఏదో విదంగా పార్లమెంటులో ఆమోదముద్ర వేయించుకోగలదు. అంటే కాంగ్రెస్ పోరాటాలతో సాధించింది ఏమీ లేకపోగా గుడ్డిగా వ్యవహరిస్తుండటం వలన దానికి కూడా దక్కాల్సిన క్రెడిట్ ఒక్క బీజేపికి మాత్రమే దక్కుతోంది… అని గ్రహించలేకపోతోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

IND vs WI 3rd T20I: India Win, But a Big Reality Check!

India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…

4 hours ago

Jailer 2 Bookings Explode: Rajini Mania Beats Weak Buzz?

Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…

6 hours ago