తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో సెప్టెంబర్ 15న మునిగిపోయిన రాయల్ వశిష్ట బొట్టును ఎట్టకేలకు పైకి తీశారు. ధర్మాడి సత్యం టీమ్ ఈ ఆపరేషన్‌ను సక్సెస్ చేసింది. బోటును సత్యం టీమ్ నీళ్లపైకి తెచ్చింది. నీటి అడుగుభాగం నుంచి రోప్‌ల సాయంతో వెలికితీశారు. మరికాసేపట్లో బోటును ధర్మాడి సత్యం ఒడ్డుకు తీసుకురానున్నారు.
ఈ ప్రమాదంలో 39 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, 12 మంది మృతదేహాలు గల్లంతయ్యాయి. అక్కడి స్థానికులు బోటు మునిగిపోయిన రోజునే 26 మందిని కాపాడారు. నిన్న బోటును బయటకు తీస్తున్న క్రమంలో మరో మృతదేహం బయటకు వచ్చింది. ఆ మృతదేహానికి తల లేకపోవడం గమనార్హం. మొదట్లో ప్రభుత్వం బోటును బయటకు తీయడానికి ఆసక్తి చూపించడం లేదు.
బాధితుల నుండి, ప్రతిపక్షాలను పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగి వచ్చింది. చాలా రోజుల శ్రమ అనంతరం ధర్మాడి సత్యం టీమ్ ఈ ఆపరేషన్‌ను సక్సెస్ చేసింది. బోటును సత్యం టీమ్ నీళ్లపైకి తెచ్చింది. నీటి అడుగుభాగం నుంచి రోప్‌ల సాయంతో వెలికితీశారు. మరికాసేపట్లో బోటును ధర్మాడి సత్యం ఒడ్డుకు తీసుకురానున్నారు.
వశిష్ట బోటు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో బోటుకు సంబంధించిన విడిభాగాలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బోటు బయటకు తీస్తుండగా అందులో నుంచి దుర్వాసన వస్తోంది. బోటులో ఉన్న మృతదేహాలు కుళ్లిపోవడం వల్లే దుర్వాసన వస్తోందని అధికారులు చెబుతున్నారు.





