Telugu

ఫీడ్ బ్యాక్ తీసుకోలేరు కానీ.. రిజల్ట్స్ మాత్రం కావాలి

మనం ఎలాంటి పని చేస్తున్నా.. అది ఎలా జరుగుతుంది అనే ఫీడ్ బ్యాక్ తీసుకోగలగడం అనేది బిగ్గెస్ట్ లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్. మనం చేస్తున్న పనిలో తప్పేమిటి? మంచేమిటి? ఏ విషయంలో మెరుగుపడాలి? ఏ విషయంలో తగ్గాలి? వంటివి తెలిసేది ఎదుటివాళ్ళు ఇచ్చే ఫీడ్ బ్యాక్ తోనే. ఇది సినిమాకి కూడా వర్తిస్తుంది. ఒక పోస్టర్/టీజర్/ట్రైలర్/పాట విడుదలైనప్పుడు భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తాయి. కొంతమంది బాగుంది అంటారు, కొంతమంది బాలేదు అంటారు. బాగుంది అన్నవాళ్ళ నుండి ఎందుకు బాగుంది? బాలేదు అన్నవాళ్ళ నుండి ఎందుకు బాలేదు అని తెలుసుకున్నప్పుడే కంటెంట్ మీద ఒక క్లారిటీ వస్తుంది.

అయితే.. ఈమధ్యకాలంలో ఒక సినిమా వచ్చే ప్రతి కంటెంట్ కి సోషల్ మీడియాలో పొలోమని పొగడ్తలు చూస్తున్నాం. ఆహా, ఓహో అద్భుతం, అమోఘం అంటూ పొగిడేస్తున్నారు. ఫలానా కంటెంట్ రిలీజ్ అయ్యింది అని చెప్పడం వేరు, ఇది అదిరిపోయింది అని ప్రతిదాన్ని లేపడం వేరు. ఈమధ్య ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ చూస్తే.. కంటెంట్ వచ్చిన గంటలో అద్భుతం అని తీర్మానించే ప్రయత్నం జరుగుతుంది. దాంతో.. ఎవరైనా ఆ కంటెంట్ ను యావరేజ్ అనో లేక బాలేదు అనో అంటే ఏదో దేశద్రోహిలాగ చూస్తున్నారు.

ADVERTISEMENT

అయితే.. ఇలా పెయిడ్ ట్వీటులు నుండి రివ్యూలు దాకా పోస్ట్ చేయించుకొనేది నిర్మాతలే. గత నెల రోజుల్లో విడుదలైన చిన్న,మిడ్ రేంజ్ సినిమాలన్నీ ఈ ఫార్మాట్ ను ఫాలో అయినవే. సినిమా నైట్ ప్రీమియర్ పడగానే.. ఉదయానికల్లా 100 ట్వీటులు, ఓ 25 పాజిటివ్ రివ్యూలు పడిపోతాయి. ఇక అవి చాలు అనుకుని నిర్మాత తడిగుడ్డ వేసుకుని పడుకుంటాడు. కట్ చేస్తే.. థియేటర్ల దగ్గర టికెట్లు తెగవు, జనాలకు ఫలానా సినిమా రిలీజ్ అయ్యిందన్న విషయం కూడా తెలియదు. కాస్త లేటుగా పోస్ట్ అయ్యే జెన్యూన్ రివ్యూల్లో ఆ సినిమా అసలు జాతకం బయటపడుతుంది.

ఇలా.. డబ్బులిచ్చి పెయిడ్ పబ్లిసిటీ చేయించుకుంటూ, మాకు నిజంగా ఏది వర్కవుట్ అవుతుందో, ఏది వర్కవుట్ అవ్వట్లేదో తెలియడం లేదు అంటూ వాపోవడం అనేది హాస్యాస్పదంగా మారింది. ఎందుకంటే.. అదే కంటెంట్ కి కాస్త జెన్యూన్ గా ఇది బాలేదు, ఇది బెటర్ గా ఉండొచ్చు అని ఒక ట్వీట్ పెట్టినా, ఒక ఆర్టికల్ రాసినా పొలోమని ఫోన్లు చేసి “సినిమాని బ్రతకనివ్వండి, చంపేయకండి” అనే కామన్ డైలాగ్ తో నిర్మాతలు, పి.ఆర్.ఓలు ఒత్తిడి తెస్తూ ఉంటారు.

ఇది సరిపోదు అన్నట్లు.. నాగవంశీ ఏమో బుక్ మై షోలో లైక్స్ కొంటున్నాం, ర్యాంకింగ్ కోసం డబ్బులు ఇస్తున్నాం అని, దిల్ రాజు ఏమో యూట్యూబ్ లో వ్యూస్ కొంటున్నామని ఓపెన్ గా చెప్పడంతో.. ఇప్పుడు ఆడియన్స్ కి అసలు ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో అర్థం కాక, జెన్యూన్ గా మౌత్ టాక్ వస్తే తప్ప థియేటర్లవైపు అడుగు వేయడం లేదు. దాంతో స్టార్ హీరోల సినిమాలకి తప్ప సగటు సినిమాకి ఓపెనింగ్స్ అనేవి లేకుండాపోయాయి. ఈ స్వీయ భ్రమ నుండి దర్శకనిర్మాతలు ఎప్పటికీ బయటపడతారో? ఫెడ్ బ్యాక్ ని కాస్త సీరియస్ గా తీసుకొని కంటెంట్ డెవలప్మెంట్ మీద ఎప్పటికీ కాన్సన్ ట్రేట్ చేయగలుగుతారో చూడాలి.

Share
Dheeraj Babu

With over 13 years of experience in the film industry, Dheeraj Babu is a seasoned film journalist and critic known for insightful analysis and a keen eye for cinematic detail. He combines a deep knowledge of film hist…

Published by

Recent Posts

Jailer 2 Cameo Twist: Big Superstar to Replace SRK?

Jailer 2 has once again grabbed attention due to fresh speculation surrounding an important cameo…

17 minutes ago

నాడు సీబీఐ ఆఫీసుకి.. నేడు ప్రధానితో భేటీ

టీవీకే పార్టీ అధినేత విజయ్‌ తమిళనాడు సిఎంగా బాధ్యతలు చేప్పటిన తర్వాత తొలిసారిగా బుధవారం ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోడీని…

41 minutes ago