
అవును.. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్ వెంటనే భారత్‌లోని జమ్ము కశ్మీర్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలలో సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. కానీ అందుకు సిద్దంగా ఉన్న భారత్ వెంటనే స్పందించి వాటిని ధ్వంసం చేసింది.
భారత్ వద్ద గల అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ, యూఏఎస్ గ్రిడ్ ద్వారా పాక్ దాడులను నిలువరించడమే కాకుండా, లాహోర్‌లో పాకిస్థాన్ ఏర్పాటు చేసుకున్న ‘చైనా మేడ్’ హెచ్క్యూ-9 గగనతల రక్షణ వ్యవస్థని ధ్వంసం చేసింది.
ఈరోజు ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న పార్టీల ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వం ఈ విషయం తెలియజేసింది.
పాక్ దాడులకు నిదర్శనంగా వాటి శకలాలను సేకరిస్తున్నామని త్వరలో మీడియా ముందు పెడతామని కేంద్రం తెలిపింది.
ఈరోజు ఉదయం లాహోర్‌లో భయంకరమైన విస్పోటనాలు జరిగాయని వార్తలు వచ్చాయి. అవి భారత్ చేసిన దాడులే అని పాక్ డీజీ ఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ధ్రువీకరించారు.
కరాచీ, లాహోర్ నగరాలపై దాడుల కోసం ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన ‘హరాప్ డ్రోన్’లను భారత్ ప్రయోగించిందని, మొత్తం 25 డ్రోన్లను పాక్ ఆర్మీ గాలిలోనే ధ్వంసం చేసిందని అహ్మద్ షరీఫ్ చౌదరి చెప్పారు. అంటే భారత్-పాక్ మద్య అప్పుడే మొదటి దశ యుద్ధం జరిగిందన్న మాట!
పాక్ సమాచార మంత్రి అతవుల్లా తరార్ ఈరోజు పాక్ పార్లమెంటులో మాట్లాడుతూ, “ఆ డ్రోన్ శకలాలను పాకిస్థాన్ గెలుచుకున్న వార్ ట్రోఫీలని, భవిష్యత్ తరాలు చూసేందుకు వాటిని సేకరించి మ్యూజియంలో పెడతామని అన్నారు. అంటే ఆయన కూడా కరాచీ, లాహోర్ మీద భారత్ దాడి చేసిందని ధృవీకరించారన్న మాట! దాంతోబాటు భారత్‌పై పాక్ దాడి చేసిందనే విషయం కూడా బయటపడింది.
Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…
GV Prakash Kumar has delivered several memorable albums in South Indian cinema, but Bollywood is…