
ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్థాన్ భూభాగంలో ఉగ్రవాద స్థావరాలను భారత్ దళాలు ధ్వంసం చేశాయి. ఈ దాడిలో సుమారు 70-80 మంది ఉగ్రవాదులు మరణించి ఉంటారని అంచనా. అయితే ఎప్పటిలాగే పాకిస్థాన్ పాలకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ మాట్లాడుతున్నారు.
పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పందిస్తూ, “మా దేశంలో భారత్ 5 చోట్ల దాడులు చేసింది. మా భూభాగంలోకి ప్రవేశించి దాడులు చేయడాన్ని యుద్ధంగానే పరిగణిస్తాము. అతి త్వరలోనే భారత్‌కు ధీటుగా తగిన విదంగా జవాబు ఇస్తాము,” అని అన్నారు.
పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అతవుల్లా తరార్ స్పందిస్తూ “భారత్ మెరుపు దాడులను పాక్ సైన్యం సమర్ధంగా తిప్పి కొట్టింది. భారత్ వాయుసేనకు చెందిన రఫెల్ యుద్ద విమానంతో సహా మొత్తం 5 యుద్ధ విమానాలను కూల్చివేశాము. దీంతో భారత్ భయపడి ఓటమి అంగీకరిస్తూ సరిహద్దుల వద్ద తెల్ల జెండాలు ప్రదర్శిస్తోంది. కానీ ఈసారి భారత్‌కు గట్టిగా బుద్ధి చెప్పకుండా విడిచిపెట్టే ప్రసక్తే లేదు,” అని అన్నారు.
పాక్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా ముగ్గురూ ముందే హెచ్చరించిన తర్వాతే ఈ ‘ఆపరేషన్ సింధూర్’ జరిగింది.
వారు ముగ్గురూ ముందుగా హెచ్చరించినప్పటికీ, భారత్ దళాలు పాకిస్థాన్‌లో సుమారు 100 కిమీ చొచ్చుకువచ్చి మరీ దాడులు చేస్తుంటే పాక్ ఆర్మీ, వాయుసేన ఎందుకు అడ్డుకోలేదు?మాపై భారత్ దాడులు చేస్తుంటే పాక్ ఆర్మీ, వాయుసేన నిద్రపోతున్నాయా?అని పాక్ పౌరులే ప్రశ్నిస్తున్నారు.
అంటే పాక్ ఆర్మీ, వాయుసేన గుర్తించేలోగానే భారత్ దళాలు దాడులు చేసి వెనక్కు తిరిగి వెళ్ళిపోయాయని స్పష్టమవుతోంది.
కానీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన, అత్యాధునిక యుద్ధ విమానాలలో ఒకటిగా నిలుస్తున్న రాఫెల్ యుద్ధ విమానాన్ని పాక్ ఆర్మీ కూల్చేసిందని మంత్రి అతవుల్లా తరార్ చెప్పుకోవడం చాలా చాలా హాస్యాస్పదంగా ఉంది.
మరో విషయం ఏమిటంటే, పాక్ స్వయంగా సరిహద్దుల ఉల్లంఘనలని నివారించే ‘సీమ్లా ఒప్పందాన్ని’ ఏకపక్షంగా రద్దు చేసుకున్నట్లు ప్రకటించి, సరిహద్దులో భారత్ గ్రామాలపై, సైనికులపై కాల్పులు మొదలుపెట్టింది.
కనుక పాకిస్థాన్ సరిహద్దులు చెరిపేసి హద్దు దాటినందున, భారత్ కూడా సరిహద్దు దాటి పాకిస్థాన్‌లో ప్రవేశించి దాడులు చేసేందుకు వీలు కల్పించినట్లయింది.
Nani's latest film The Paradise marked one of the most ambitious attempts of his career.…
Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…