Telugu

పాకిస్తాన్ కు మద్దెల దరువే…

ఒక్క తొందరపాటు చర్య, ఒక్క తప్పటడుగు దేశ పరిస్థితిని నడిరోడ్డు మీదకు లాగేసింది. భారతదేశపు సహనానికి, దయా గుణానికి యుద్ధం అనే ఆయుధాన్ని పెట్టాల్సిన అవసరాన్ని, ఆవశ్యతకను పాక్ కోరుండి మరి తెచ్చుకుంది.

మా దేశ అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను వదిలిపెట్టేదిలేదు, బాధిత కుటుంబాలు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి బదులు చెప్పి తీరుతాం, మా ఈ ప్రతిచర్య కేవలం ఉగ్రవాదం అంతం మీదే అంటూ ‘ఆపరేషన్ సింధూర్’ మొదలుపెట్టిన భారత్ పై పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది.

ADVERTISEMENT

ఆ ఒక్క తప్పటడుగు, ఒక్క తొందర పాటు చర్య నేడు పాకిస్తాన్ సాయం కోసం పొరుగు దేశాలను రోదించే పరిస్థితిలో నిల్చోబెట్టింది. దేశ నాయకులు, ప్రధాని సైతం ప్రాణ భయంతో దాక్కునేలా చేసింది.

భారత్ – పాక్ ల మధ్య నెల్లకొన్న ఈ ఘర్షణ వాతావరణం కారణంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ తన విదేశీ పర్యటనలను సైతం రద్దు చేసుకుని దేశ రక్షణ కోసం, ఇక్కడి ప్రజల క్షేమం కోసం ప్రణాళికలు రచిస్తూ భారత సైన్యాన్ని వెనకుండి నడిపిస్తున్నారు.

కానీ అక్కడ పాకిస్తాన్ లో ఇటువంటి యుద్ధ వాతావరణం నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన ప్రధాని, దేశ ప్రజలకు నేనున్నాను అనే భరోసా కల్పించాల్సిన నాయకులు బిక్కుబిక్కుమంటూ భయం గుప్పిట్లో బయటకు రాకుండా దాక్కుంటున్నారు. ఈ ఘటనలే ఆ దేశ ప్రజలకు అక్కడి నాయకుల మీద ద్వేషాన్ని రగులుస్తున్నాయి.

భారత్ యుద్ధం మొదలు పెట్టక ముందు మీ మీద అణ్వస్త్రాలు ప్రయోగిస్తాం, భారత్ సైన్యానికి ధీటైన జవాబు చెపుతాం, సింధూ నదీ జలాలు పాక్ కు రాకపోతే అక్కడ పారేది నీరు కాదు భారతీయుల రక్తం అంటూ ప్రగల్భాలు పలికిన పాక్ నాయకులు, ఉగ్రవాదులు ఇప్పుడు భారత సైనిక దాడిని ఎదిరించలేక తలలు దాచుకున్నారు.

ఇక భారత్ తో పోరు సంగతి ఇలా ఉంటే, పాక్ లోనే సొంత కుంపటి కోసం పోరాడుతున్న బలోచిస్తాన్ దొరికిందే సందన్నట్టు పాక్ పై విరుచుకుపడుతుంది. ఇక ఇటు పాక్ లోని ఉగ్రవాద సంస్థ అయిన తైహ్రిక్ ఈ తాలిబన్ పాకిస్తాన్(TTP) ఫైటర్ లేజర్ రైఫిల్స్ తో 20 మంది పాక్ ఆర్మీని అంతం చేసినట్టు వార్తలొస్తున్నాయి. వీరు ఏడాదిగా పాక్ ఆర్మీ తో అంతర్గత పోరాటం చేస్తున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే ఇక పాకిస్తాన్ లో రాజకీయం కూడా పడగ విప్పింది. భారత ఆర్మీ పాకిస్తాన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే మా దేశ ప్రధాని పిరికి పందాల ఎక్కడో దాక్కున్నారు, మీ చేతకాని తనమే పాకిస్థాన్ కీ ఈ పరిస్థితిని తీసుకొచ్చింది అంటూ ఆ దేశ నాయకులు తమ నాయకత్వం మీద, ఆర్మీ చీఫ్ వ్యవహార శైలి మీద బూతులతో రెచ్చిపోతున్నారు.

ఇక పాకిస్తాన్ మాజీ ప్రధాని వసీం అక్రమ్ ను అన్యాయంగా అరెస్టు చేసారు, వెంటనే విడుదల చెయ్యాలంటూ అయన సానుభూతిపరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తమకు చేదోడువాదోడుగా ఉంటూ సాయం అందిస్తుందిలే అనుకున్న అగ్రరాజ్యం పాకిస్తాన్ చర్యల మీద వ్యతిరేక స్వరం వినిపించింది. అలాగే ఇటు చైనా కూడా మౌనాన్ని ఆశ్రయించడంతో పాక్ నిండా మునిగినట్టయ్యింది.

ఇటు భారత్ తో యుద్ధ భయం, అటు బలూచిస్తాన్ తో వేర్పాటు వాదం, ఇక TTP తో అంతర్గత పోరు, దేశ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత, ప్రత్యర్థి పార్టీల నుండి రాజకీయ ఒత్తిడులు, చేయూతనిచ్చే ఆపన్న హస్తం లేక, ఆదుకునే దిక్కు తోచక, ఇంటా భయటా మద్దెల దరువు మాదిరి పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ranabaali Under Pressure: Is Vijay Betting Too Much on the Trailer?

Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…

22 minutes ago

GV Prakash’s Big Bollywood Test

GV Prakash Kumar has delivered several memorable albums in South Indian cinema, but Bollywood is…

51 minutes ago