పాక్‌కి వంతపాడిన కశ్మీర్‌పైనే తొలి దాడులు!

జమ్ము కశ్మీర్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలు, స్థానికులు, ముఖ్యంగా యువత వేర్పాటువాదానికి మొగ్గు చూపేవారు. పాక్‌ ఉగ్రవాదులు రాష్ట్రంలో, దేశంలో దాడులు చేసేందుకు వస్తే వారికి ఆశ్రయం కల్పిస్తుండేవారు, అందరూ పాకిస్థాన్‌కు వంత పాడుతుండేవారు. వేర్పాటువాదుల చేతులు కలిపిన యువత, భారత్‌ భద్రతా దళాలపై రాళ్ళు రువ్వుతుండేవారు.

ADVERTISEMENT

భద్రతా దళాలు, నిఘా సంస్థలు తమ ప్రాణాలకు తెగించి బందించిన కరడుగట్టిన వేర్పాటువాదులను, ఉగ్రవాదులను జైళ్ళలో నుంచి విడిచిపెట్టాలని తహతహలాడే ప్రాంతీయ పార్టీలు, అధికారంలోకి రాగానే తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ వారికి విముక్తి ప్రసాదిస్తుండేవి. ఇవేవీ రహస్య విషయాలు కావు. జమ్ము కశ్మీర్‌లో దశాబ్ధాలుగా జరుగుతున్నవే.

ఈ కారణంగా ఒకప్పుడు ప్రకృతి అందాలకు నిలయంగా దేశవిదేశీ పర్యాటకులతో కళకళలాడుతుందే జమ్ము కశ్మీర్‌, పాక్‌ మాదిరిగా ఉగ్రవాద కేంద్రంగా మారిపోయింది.

ఇంతటి దయనీయ స్థితిలో ఉన్న జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాన్ని మోడీ ప్రభుత్వం అతి కష్టం మీద మెల్లగా గాడిలో పెట్టింది. ఎంతో దూరదృష్టి, తెగువ, ధృడమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేసే సాహసం ఉంటే తప్ప ఇటువంటివి సాధ్యం కావు.

మోడీ ప్రభుత్వం, భద్రతా దళాలు, నిఘా వర్గాల సంయుక్త ప్రయత్నాలు ఫలించి జమ్ము కశ్మీర్‌ మళ్ళీ గాడిన పడింది.

కానీ ఈ మార్పును జీర్ణించుకోలేని వేర్పాటువాదులు, ఉగ్రవాదులు, వారికి అండగా నిలిస్తున్న పాక్‌ పాలకులు పహల్గాం ఉగ్రదాడితో జమ్ము కశ్మీర్‌లో పరిస్థితిని యధాస్థితికి తేవాలనుకున్నారు. కానీ వారు ఊహించని విదంగా మోడీ ప్రభుత్వం పాక్‌ మీద ఆంక్షలు విధించడం వంటి చర్యలతో సరిపెట్టలేదు. ఆపరేషన్ సింధూర్‌ చేపట్టింది!

ఇది పాకిస్థాన్‌ ఊహించని పరిణామమే. పాకిస్థాన్‌ మొదట షాక్ అయినప్పటికీ, దానికి ఎప్పటి నుంచో భారత్‌తో యుద్ధం చేయాలని దురద ఉంది. కనుక యుద్ధం ప్రారంభించింది. దానికి అప్పుడే మూల్యం చెల్లిస్తోంది కూడా.

ఈ యుద్ధం ఇంకా ఎన్ని రోజులు సాగుతుందో, ఎప్పుడు ఏవిదంగా ముగుస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ఇరుదేశాలలో సామాన్య ప్రజలు వాటి పర్యవసానాలు అనుభవించక తప్పదు.

చివరిగా చెప్పుకోవలసిన ఓ ముఖ్యమైన విషయం ఉంది. ఇంతకాలం కశ్మీర్‌లో ప్రాంతీయ పార్టీలు, ప్రజలు పాకిస్థాన్‌కు వంత పాడారు. కానీ ఇప్పుడు అదే పాకిస్థాన్‌ మొట్ట మొదట వారి మీదే క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది!

కనుక ఇప్పటికైనా కశ్మీర్‌లో ప్రాంతీయ పార్టీలు, ప్రజలు, ముఖ్యంగా వేర్పాటువాదం, పాకిస్థాన్‌వైపు మొగ్గు చూపుతున్న యువత పాక్‌ చేతిలో తాము పావులు మాత్రమేనని, అవసరమైతే తమని అడ్డుతొలగించుకోవడానికి వెనకాడదని గ్రహిస్తే మంచిది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ranabaali Under Pressure: Is Vijay Betting Too Much on the Trailer?

Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…

22 minutes ago

GV Prakash’s Big Bollywood Test

GV Prakash Kumar has delivered several memorable albums in South Indian cinema, but Bollywood is…

51 minutes ago