
ఆందోళన మధ్య తెదేపా, వైకాపా ఇచ్చిన అవిశ్వాస నోటీసులను స్పీకర్ సుమిత్రా మహాజన్ చదివి వినిపించారు. సభ సజావుగా సాగితేనే అవిశ్వాస తీర్మానాలపై చర్చ చేపట్టవచ్చన్నారు. సభ్యుల సంఖ్య లెక్కించడానికి అవకాశం కల్పించాలని, సంయమనం పాటించాలని స్పీకర్ కోరినా సభ్యులు ఆందోళన చేయడంతో సభను బుధవారానికి వాయిదా వేశారు.
గత కొద్ది రోజులుగా లోక్ సభలో ఇదే తంతు జరుగుతుంది. సభ్యుల ఆందోళన పేరుతో అవిశ్వాసతీర్మాణాలను స్పీకర్ పక్కన పెడుతూ వస్తున్నారు. ఇక రేపో ఎల్లుండో సభను నిరవధికంగా వాయిదా వెయ్యడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు అవిశ్వాసంపై అన్నిపార్టీల నేతలతో మాట్లాడి మద్ధతు కోరతానని.. ఆంధ్రప్రదేశ్‌కు సహకరించమని అడుగుతానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.
రాప్తాడు ఘటన పిల్లలలో, ఆ పిల్లల తల్లితండ్రులలో ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఒక ప్రభుత్వ పాఠశాలలోకి ఒక వ్యక్తి ప్రమాదకరమైన…
మానవసంబంధాల బలహీనత సమాజాన్ని ఎటువైపుకి తీసుకెళుతుంది అనేదానికి నేడు సమాజంలో జరుగుతున్న ఎన్నో దారుణాలు సజీవ సాక్ష్యాలుగా కళ్ళ ముందు…