పవన్ ఫ్యాన్స్ అడ్వాన్స్ బుకింగ్ లు చేసుకోవచ్చు!

Pawan Kalyan Sardaar Gabbar Singh release date confirmedఎప్పుడెప్పుడూ తమ అభిమాన హీరో వెండితెరపై కనపడతారా అని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ శుభవార్త. పవన్ నటిస్తున్న తాజా చిత్రం “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా రిలీజ్ డేట్ లాక్ అయ్యింది. ఇటీవల హల్చల్ చేసిన విధంగా ఏప్రిల్ 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రత్నాపూర్ కా సర్ధార్ ఆగమనానికి రంగం సిద్ధమైంది.

ఈ సినిమా నిర్మాత శరత్ మరార్ ద్వారా విడుదల తేదీ ఖరారయ్యింది. ఇక, పవన్ అభిమానులు అడ్వాన్స్ బుకింగ్ లు ప్రారంభించుకోవచ్చు. రెండు నెలల తర్వాత సినిమాకు ఇప్పుడే అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు ఏంటి? టికెట్లు కాదులేండి… ఆ రోజు ఎలాగూ డుమ్మా కొడతారు కదా..! అలా బంక్ కొట్టేబదులు ఇప్పటినుండే ఏదొక కారణం చెప్పేస్తే పోలా..! అయినా అభిమానులకు మరొకరు సలహా ఇవ్వాలా..? పవన్ ఎంట్రీ ఇవ్వలే గానీ… దేనికైనా రెడీ అనేయరు… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్..!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories