‘పెళ్లికొడుకు’ గెటప్ లో ‘సర్ధార్’ స్టిల్!

Pic Talk: Sardaar without uniform“సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమాలో పోలీస్ డ్రెస్ లతో అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పవర్ స్టార్ స్టిల్స్ లో మరొకటి వచ్చి చేరింది. అయితే ఈ సారి పోలీస్ డ్రెస్ లో కాదు, చక్కనైన పెళ్లి కొడుకు గెటప్ లో మెరిసిపోతున్నాడు.

ADVERTISEMENT

తలపాగా చుట్టుకుని కమెడియన్ కృష్ణ భగవాన్ తో పాటు ఉన్న ఈ స్టిల్ ప్రస్తుతం పవన్ అభిమానుల షేర్స్ తో హంగామా చేస్తోంది. ఈ సినిమా తొలినాళ్ళల్లో ఈ స్టిల్స్ లీక్ పై కొంత నియంత్రణ పెట్టినప్పటికీ, ఆడియో విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది “సర్ధార్” స్టిల్స్ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

ఇటీవల విడుదలైన మేకింగ్ వీడియోతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్న “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా ఘనవిజయంపై అభిమానుల ఆశలను ఈ స్టిల్స్ మరింత రెట్టింపు చేస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ అందరి చూపులు… ప్రస్తుతం ఈ నెల 20వ తేదీన విడుదల కాబోతున్న ఆడియో వేడుక వైపుకే…!

ADVERTISEMENT
Latest Stories