
నేడు విడుదలైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ అనూహ్య విజయాన్ని సొంత చేసుకుంది. మొత్తం 288 స్థానాలకు గాను 229 స్థానాలలో ఎన్డీయే కూటమి విజయాన్ని సాధించి అధికార పక్షంగా అవతరించింది.
ఏపీలో జరిగిన ఎన్నికలలో 100 % స్ట్రైక్ రేట్ సాధించి దేశ వ్యాప్తంగా పాపులర్ పొలిటిషన్ గా మారిన పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీ చెప్పిన ‘ఏ పవన్ నహి..ఏ ఆంధీ హే’ డైలాగ్ తో సోషల్ మీడియాలో ట్రేండింగ్ అయ్యారు.
అయితే ఈ మహా ఎన్నికల ప్రచారంలో బీజేపీ స్టార్ క్యాంపైనర్ గా ఎన్డీయే తరుపున రంగంలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలు తనపై ఉంచిన నమ్మకాన్ని వందకు వంద శాతం నిలబెట్టుకున్నారనే చెప్పాలి.
ఎన్డీయే అభ్యర్థుల తరుపున మహారాష్ట్రలో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన సోలాపూర్, బల్లాపూర్, డెగ్లూర్, పూణే లాతూర్ ప్రాంతాలలో బీజేపీ విజయం సాధించడంతో మరో సారి పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ గా నిలిచారు. దీనితో పవన్ అంటే లోకల్ అనుకుంటివా…నేషనల్ అంటూ పవన్ ఫాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తూ దీన్ని ట్రెండ్ చేస్తున్నారు.
తెలుగు వారు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాలలో పవన్ ప్రచారం బీజేపీ పార్టీకి, ఎన్డీయే మెజారిటీకి కీలకంగా మారడంతో, బీజేపీ పెద్దలు ఎంచుకున్న పవన్ అనే ‘అస్త్రం’, బీజేపీ అనుసరించిన వ్యూహాలు అన్ని ఫలితాలు ఇవ్వడంతో మహారాష్ట్రలో ఎన్డీయే భారీ విజయాన్ని దక్కించుకోగలిగింది.
పదేళ్ల రాజకీయ అవమానాలకు, వ్యక్తిగత దూషణలకు 2024 పవన్ కు మంచి అనుభూతులను మిగిల్చిందనే చెప్పాలి. ఈ ఏడాది మొదట్లో ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం బంపర్ విక్టరీ కొట్టడం, అందులో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాలలో విజయం సాధించడం, ఇక ఆతరువాత జరిగిన పరిణామాలన్నీ పవన్ జీవితంలో మరిచిపోలేని రోజులనే చెప్పాలి.
ఇక ఈ ఏడాది చివరాంకంలో మహారాష్ట్ర లో పవన్ ప్రచారం ఆశించిన ఫలితాలు ఇవ్వడంతో 2024 పవన్ జీవితంలో ఎన్నో తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. అలాగే మహా విజయంతో సంబరాలలో తేలియాడుతున్న బీజేపీకి సౌత్ లో పవన్ రూపంలో ఒక స్టార్ క్యాంపైనర్ దొరికినట్టే చెప్పొచ్చు.
ఇప్పటికే తమిళనాడులో పవన్ తో సనాతన ధర్మం అనే ‘మంత్రం’తో తెర వెనుక రాజకీయం నడుపుతున్న బీజేపీ, తమిళనాడు ఎన్నికలకు కూడా పవన్ కళ్యాణ్ నే ‘ఆయుధం’గా వాడనున్నారు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే పవన్ చరిష్మా బీజేపీ పార్టీతో పాటు ఏపీ అభివృద్ధికి కూడా ఉపయోగపడితే ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి.
The TDP, Jana Sena and BJP scripted a major victory in the 2024 Andhra Pradesh…
Chiranjeevi's Vishwambhara has been waiting for its theatrical release for a long time. Fans are…